
ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో భారత స్టార్ ఆటగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెప్టెంబర్ 2025 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు గత నెలలో తమ అద్భుతమైన మ్యాచ్ ప్రదర్శనతో గుర్తింపు పొందారు. భారతదేశం తొమ్మిదవ 'ఆసియా కప్' టైటిల్ సాధించడంలో అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. జింబాబ్వేకు చెందిన బెన్నెట్, 2026 T20 ప్రపంచ కప్ అర్హత సాధించడంలో అద్భుతమైన బ్యాటింగ్ ద్వారా జింబాబ్వే విజయంలో కీలక పాత్ర వహించాడు.
Details
అభిషేక్ శర్మ
2025 ఆసియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. 7 ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేశాడు, సగటు 44.86, స్ట్రైకింగ్ రేట్ 200, ఇది టోర్నమెంట్‌లో అత్యధికం. కుల్దీప్ యాదవ్ బంతితో తన మ్యాజిక్ చూపించి, 7 ఇన్నింగ్స్‌లో 17 వికెట్లు తీసుకొని టోర్నమెంట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. బ్రియాన్ బెన్నెట్తొ తొమ్మిది T20 మ్యాచ్‌ల్లో 497 పరుగులు, సగటు 55.22, స్ట్రైకింగ్ రేట్ 165.66 నమోదు చేసి జింబాబ్వే విజయాల్లో కీలక పాత్ర వహించాడు మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో భారత జట్టు తరఫున స్మృతి మంధాన, దక్షిణాఫ్రికా తరఫున తాజ్మిన్ బ్రిట్స్, పాకిస్థాన్ తరఫున సిద్రా అమీన్ ఎంపిక అయ్యారు.