Page Loader
T20 WC 2024: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన 
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

T20 WC 2024: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2024
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది. అదే సమయంలో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఇద్దరు వికెట్ కీపర్లను జట్టులోకి తీసుకున్నారు. వీరిలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఉన్నారు. అదే సమయంలో కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు. గత టీ20 ప్రపంచకప్‌లో రాహుల్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.T20 ప్రపంచ కప్‌ను వెస్టిండీస్, USA సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచకప్‌ జూన్ 1నుండి ప్రారంభమవుతుంది.ఫైనల్ మ్యాచ్ జూన్ 29 న జరుగుతుంది. జట్టుకు సంబంధించి, కెప్టెన్ రోహిత్ శర్మ,సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కూడా ముంబైలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో మే 2 సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు.

Details

2007లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత్‌ 

భారత జట్టు చివరిసారిగా 2007లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇది ఈ ఫార్మాట్ మొదటి ఎడిషన్. 17 ఏళ్లుగా ఈ ట్రోఫీని గెలవడాం కోసం భారత్ కష్టపడుతోంది. చివరిసారి అంటే 2022లో సెమీఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

Details

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు

భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), సంజూ శాంసన్ (WK), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. రిజర్వ్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ చేసిన ట్వీట్