Para-Asian Games: పారా ఆసియా క్రీడలకు పయనమైన భారత బృందం
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. ఈ టోర్నీలో భారత అథ్లెట్లు 107 పతకాలు సాధించి సత్తా చాటారు.
ఇప్పుడిక పారా ఆసియా క్రీడలకు సమయం అసన్నమైంది. హాంగ్జే వేదికగా ఈనెల 22 నుంచి 28 వరకు నాలుగో ఆసియా పారా ఆసియా క్రీడలు జరగనున్నాయి.
ఈ క్రీడల్లో భారత్ నుంచి 196 మంది పురుషులు, 113 మంది మహిళలు సహా మొత్తం 309 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు.
కానో, బ్లైండ్ ఫుట్‌బాల్, లాన్ బౌల్స్, రోయింగ్, టైక్వాండో వంటి ఐదు క్రీడలతో సహా 17 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడనున్నారు.
ఇక 2020 పారా ఒలింపిక్‌లో బంగారు పతక సాధించిన అవని లేఖరా, సుమిత్ యాంటిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
Details
అథ్లెట్లకు అన్ని విధాలా అండగా ఉంటాం: అనురాగ్ ఠాకూర్
గత పారా ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 72 పతకాలను సాధించింది. ఈ సారి అంతకుమించి రాణించాలని భారత అథ్లెట్లు గురువారం హాంగ్జే బయల్దేరారు.
ఇక కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, అనురాగ్ ఠాకూర్, భారత పారా ఒలింపిక్ కమిటీ ఛైర్మన్ దీపా మాలిక్ భారత అథ్లెట్లకు ఘనంగా వీడ్కోలు పలికారు.
పారా అథ్లెట్లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, దేశం గర్వించేలా అథ్లెట్లు రాణిస్తారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అశాభావం వ్యక్తం చేశారు.