2011ను రిపీట్ చేసేలా కనిపిస్తున్న టీమిండియా.. పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కామెంట్స్
వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్, పాకిస్తాన్ ల మధ్య శనివారం రోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయాబ్ అక్తర్, రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడాడు. పాకిస్తాన్ పై జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ అరాచకం సృష్టించాడని, తన బ్యాటుతో పరుగుల వరద పారించాడని షోయాబ్ అక్తర్ అన్నారు. 2023 ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రదర్శన చూస్తుంటే, 2011 ప్రపంచ కప్ చరిత్రను మళ్లీ తిరగరాసేలా కనిపిస్తున్నారని ఆయన అన్నారు.
రోహిత్ శర్మ ఆడుతుంటే చూడలేకపోయాను
సెమీఫైనల్ లో ఎలాంటి అడ్డంకులు కలగకపోతే భారత జట్టుకు 2023 ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని షోయాబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చారు. అంతేకాదు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి మరింత మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా రోహిత్ శర్మ సరిగా ఆడలేదని, కానీ వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ మెరుగైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడని, పాకిస్తాన్ పై పరుగుల వారి వరద పారిస్తుంటే తాను చూడలేకపోయానని షోయాబ్ అక్తర్ తెలియజేశారు. అటు పాకిస్తాన్ ఆటగాళ్ల నుండే కాదు భారత జట్టు ఆటగాళ్లపై చాలామంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.