ఆసియా గేమ్స్‌లో భారత వాలీబాల్ జట్టు ప్రభంజనం.. నాకౌట్‌కు అర్హత
ఆసియా క్రీడల్లో భారత వాలీబాల్ జట్టు ప్రభంజనం సృష్టించింది. దక్షిణా కొరియాను మట్టి కరిపించి నాకౌట్‌కు భారత పురుషుల వాలీ బాల్ జట్టు అర్హత సాధించింది. 2 గంటల 38 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచులో ఇండియా టీమ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 3-2 (25-27, 29-27, 25-22, 20-25, 17-15)తో కమాండింగ్ స్కోర్‌తో దక్షిణా కొరియాపై విజయం సాధించింది. అమిత్ గులియా, అశ్వల్ రాయ్, వినీత్ కుమార్ పురుషుల వాలీబాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అగ్రశేణి జట్టుపై విజయం సాధించిన భారత జట్టు
ఆసియా క్రీడల్లో వాలీబాల్‌లో అగ్రశేణి జట్టు అయినా దక్షిణా కొరియాపై భారత జట్టు విజయం సాధించడం విశేషం. 1966 నుంచి జరుగుతున్న ఆషియా క్రీడల్లో దక్షిణా కొరియా జట్టు గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ మెడల్స్ సాధిస్తోంది. ఇక భారత జట్టు చివరిసారిగా 1986లో సియోల్ బ్రాంజ్ మెడల్ తో సరిపెట్టుకుంది. దక్షిణ కొరియాపై విజయం భారత పురుషుల వాలీబాల్ జట్టు ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధిస్తోంది. ఈ మ్యాచులో అమిత్ 25 పాయింట్ల స్కోర్ చేయగా, అశ్వయ్ రాయ్, వినీత్ కుమార్ చెరో 19 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు.