LOADING...
IND-W vs PAK-W: 88 పరుగులతో పాక్‌ను చిత్తు చేసిన భారత టీమిండియా
88 పరుగులతో పాక్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు

IND-W vs PAK-W: 88 పరుగులతో పాక్‌ను చిత్తు చేసిన భారత టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
11:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందిన భారత్‌ ఈసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. కీలక సమయంలో హర్లీన్ డియోల్ (46), రిచా ఘోష్ (అజేయంగా 35) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో పాకిస్థాన్‌ జట్టు 43 ఓవర్లకే 159 పరుగులకు ఆలౌటై పోయింది. సిద్రా అమీన్‌ (81) చివరి వరకు పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

Details

రాణించిన భారత బౌలర్లు

భారత్‌ బౌలింగ్ విభాగంలో క్రాంతి గౌడ్‌ 3 వికెట్లు, దీప్తి శర్మ 3 వికెట్లు, స్నేహ్ రాణా 2 వికెట్లు తీసి పాక్‌ను కట్టడి చేశారు. మొత్తంగా భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అదరగొట్టి మరోసారి విజయాన్ని అందుకుంది.