LOADING...
IND w Vs AUS w: ఆసీస్‌తో కీలక ఫైట్.. టాస్ ఓడిన భారత మహిళల జట్టు!
ఆసీస్‌తో కీలక ఫైట్.. టాస్ ఓడిన భారత మహిళల జట్టు!

IND w Vs AUS w: ఆసీస్‌తో కీలక ఫైట్.. టాస్ ఓడిన భారత మహిళల జట్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Womens World Cup) భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత జట్టుకు, గత పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైంది. ఆ పరాజయాన్ని మరచి, ఆస్ట్రేలియాను ఢీకొని గెలవాలనే ఆశాభావం అభిమానుల్లో ఉంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా ప్రత్యేకంగా స్టేడియం చేరుకున్నారు.

Details

తుది జట్లు ఇవే

భారత్‌ ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్ జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి ఆస్ట్రేలియా అలీసా హీలే (కెప్టెన్/వికెట్ కీపర్), ఫోబ్ లిట్చ్‌ఫీల్డ్, ఎల్సీ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డెనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ స్కట్