IND w Vs AUS w: తొలి టీ20లో ఆసీస్‌పై భారత మహిళా జట్టు విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 15, 2026
05:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ఘన విజయంతో ప్రారంభించింది. సిడ్నీ వేదికలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ 21 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది (డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం). తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్ష్య ఛేదనలో భారత్ 5.1 ఓవర్లలో 50 పరుగులు చేసి, ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. అయితే, మ్యాచ్ సమయంలో వర్షం రావడంతో ఆట ఆగింది.
Details
డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో విజయం
కానీ వర్షం నిరంతరం కురవడంతో, అంపైర్లు ఫలితాన్ని డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో ప్రకటించారు. ఆ సమయంలో భారత్ అదనంగా 21 పరుగులు చేయడంతో విజేతగా ప్రకటించారు. మొత్తంగా వర్షం కారణంగా ఆట మధ్యలో ఆగినప్పటికీ, భారత మహిళా క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ ఇచ్చారు.