హాంకాంగ్‌ను ఓడించిన భారత మహిళల జట్టు
ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత మహిళల ఏ జట్టుకు శుభాంరభం లభించింది. తొలి మ్యాచులలో పసికూన హాంకాంగ్ పై భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ కేవలం రెండు పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది. దీంతో హాంకాంగ్ 14 ఓవర్లలో 34 పరుగులు చేసి ఆలౌటైంది. హాంకాంగ్ తరుపున ఓపెనర్ మరికో హిల్స్ 14 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 5.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
చెలరేగిన శ్రేయాంక పాటిల్
ఆల్ రౌండర్ శ్రేయాంక తోపాటు పాటు మన్నత్ కశ్యప్ రెండు ఓవర్లలో రెండు పరుగులిచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టింది. భారత మహిళల తరుపున తెలుగు అమ్మాయి గొంగడి త్రిష, ఉమా ఛెత్రి ఇద్దరూ అధ్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచులో విజృంభించిన శ్రేయాంక పాటిల్ డబ్ల్యూపీఎల్ లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె మహిళల ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ తరుపున ఆడింది. ఈ టోర్నీలో భారత మహిళల ఏ జట్టు తర్వాతి మ్యాచుల్లో థార్యులాండ్-ఎ, పాకిస్థాన్-ఎ జట్టతో తలపడనుంది.