SL vs IND: టెస్టుల్లో ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఈ నెల 15 నుంచి తొలి టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్-శ్రీలంక మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో నమోదైన రికార్డులు, ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్దాం. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా శ్రీలంక పేరిట రికార్డు ఉంది. 1997లో కొలంబోలో భారత్‌తో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి ఏకంగా 952 పరుగులు చేసింది. భారత బౌలర్లు 271 ఓవర్లు బౌలింగ్ చేయగా రాజేశ్ చౌహాన్ ఒక్కడే 78 ఓవర్లు వేశాడు. శ్రీలంక బ్యాటర్లలో సనత్ జయసూర్య 340 పరుగులు చేయగా మహేళ జయవర్ధనే 167 పరుగులు చేశాడు.
వివరాలు
ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 610 పరుగులు..
అదే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 537 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్ (143), మహ్మద్ అజహరుద్దీన్ (126), నవజ్యోత్ సింగ్ సిద్ధు (111) సెంచరీలు చేశారు.
అరంగేట్రం టెస్టులోనే తొలి బంతికి వికెట్ తీసిన తొలి భారతీయ బౌలర్‌గా నీలేశ్ కులకర్ణి నిలిచాడు.
1997లో శ్రీలంకతో జరిగిన టెస్టులో మర్వన్ అటపట్టును ఔట్ చేసి అతడు ఈ ఘనత సాధించాడు.
భారత్-శ్రీలంక టెస్టు సిరీస్‌లలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
2017లో శ్రీలంక పర్యటనలో కోహ్లీ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 610 పరుగులు చేశాడు.
వివరాలు
శ్రీలంకతోనే తొలి టెస్ట్..
మహేంద్ర సింగ్ ధోనీ కూడా శ్రీలంకతో జరిగిన సిరీస్‌తోనే టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
2005లో జరిగిన పర్యటనలో ధోనీ తొలిసారి భారత టెస్టు జట్టులోకి వచ్చాడు.
ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో విరివిగా ఉపయోగిస్తున్న డీఆర్‌ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను భారత్-శ్రీలంక టెస్టు సిరీస్‌లోనే తొలిసారిగా 2008లో పరీక్షించారు.
శ్రీలంక స్పిన్ అంటే ముత్తయ్య మురళీథరన్ గుర్తుకొచ్చే రోజుల్లో అజంతా మెండిస్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
2008లో జరిగిన సిరీస్‌లో మెండిస్ మొత్తం 26 వికెట్లు పడగొట్టాడు. అదే సిరీస్‌లో మురళీథరన్ 21 వికెట్లు తీసుకున్నాడు.
2017లో దిల్లీలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు మాస్కులు ధరించి ఆడారు.
దిల్లీలో నెలకొన్న వాయుకాలుష్యం కారణంగా వారు ఇలా ఆడాల్సి వచ్చింది.
వివరాలు
9 మ్యాచ్‌లు డ్రా..
ముఖ్యంగా బౌలింగ్ చేసే సమయంలో సురంగ లక్మల్, లహిరు గమాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీని కేవలం ఏడు పరుగుల తేడాతో చేజార్చుకున్న మ్యాచ్ కూడా శ్రీలంకతోనే జరిగింది.
2009లో ముంబయిలో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 293 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇప్పటివరకు భారత్-శ్రీలంక మధ్య మొత్తం 46 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి.
ఇందులో భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. శ్రీలంక 7 టెస్టుల్లో గెలిచింది. మరో 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఇక భారత్‌లో జరిగిన టెస్టుల్లో శ్రీలంక ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు.
మన దేశంలో ఆడిన 22 టెస్టుల్లో శ్రీలంక 13 మ్యాచ్‌ల్లో ఓటమిపాలవగా.. 9 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.