IPL 2023: 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ
ఐపీఎల్ లో ఓ కొత్త కార్యక్రమానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఫ్లే ఆఫ్స్ స్టేజ్ లో జరిగే మ్యాచులలో పడే ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు నాటాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచులో 84 డాట్ బాల్స్ పడ్డాయి. దీంతో బీసీసీఐ మొత్తం మీద 42 వేల మొక్కలను నాటనుంది. ఇక నాలుగు మ్యాచులో 200 డాట్స్ బాల్స్ పడితే మొత్తంగా లక్ష మొక్కలను దేశ వ్యాప్తంగా నాటనుంది. అదే విధంగా ఐపీఎల్ 2023 సీజన్ మొదటి ఎలిమినేటర్ లో తొలి డాట్ బాల్ పడగానే మొక్క బొమ్మను స్కోర్ బోర్డు చూపించడం గమనార్హం.
టాటా కంపెనీస్ తో చేతులు కలిపిన బీసీసీఐ
డాట్ బాల్స్ పెరిగే కొద్ది నాటే మొక్కల లెక్కను స్కోరు బోర్డు చూపించనున్నారు. గత సీజన్లో ఫైనల్ కు చేరిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 202 సీజన్ తర్వాత దేశ వ్యాప్తంగా 5 లక్షల మొక్కలను నాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం వెనుక రాజస్థాన్ రాయల్స్ ఆలోచనే కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్లేఆఫ్స్ లో ఒక్కో డాట్ బాల్ కు 500 మొక్కలు నాటడానికి టాటా కంపెనీస్ తో చేతులు కలపడం చాలా గర్వంగా ఉందని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.