IPL 2023: గుజరాత్, ఢిల్లీ జట్టులోని కీలక ఆటగాళ్ల ఓ లుక్కేయండి
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 44వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్ లో గత మ్యాచ్ లో ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
గుజరాత్ ఎనిమిది మ్యాచ్ లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ కేవలం ఎనిమిది మ్యాచ్ లో రెండు విజయాలను సాధించి చివరి స్థానంలో కొనసాగుతోంది.
మహ్మద్ షమీ ఐపీఎల్లో వార్నర్ ను రెండుసార్లు ఔట్ చేశాడు. అదే విధంగా ఈ సీజన్లో షమీ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (8) తీసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈసారీ షమీని వార్నర్ ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి.
Details
అక్షర్ పటేల్ బౌలింగ్ లో హార్ధిక్ పాండ్యా రాణించేనా!
అక్షర పటేల్ ఢిల్లీ తరుపున ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ను ఐపీఎల్ లో అక్షర్ పటేల్ రెండు సార్లు ఔట్ చేశాడు. ఎడమచేతి వాటం బౌలర్లలో రషీద్ ఖాన్ గొప్పగా రాణించే అవకాశం ఉంది.
శుభ్‌మాన్ గిల్, అన్రిచ్ నార్ట్జే ఐదు ఇన్నింగ్స్ లో తలపడగా.. రెండుసార్లు గిల్ ని అన్రిచ్ నార్ట్జే ఔట్ చేయడం విశేషం. ఓపెనర్ గా గిల్ కు ఈ సీజన్ స్ట్రైక్ రేట్ 161.90గా ఉంది.
హార్ధిక్ పాండ్యా 22 ఇన్నింగ్స్ లో ఆరుసార్లు ఎడమచేతి వాటం సిన్నర్ల చేతిలో ఔట్ అయ్యాడు. అయితే అక్షర పటేల్ బౌలింగ్లో పరుగులు రాబట్టడానికి హార్ధిక్ పాండ్యా ఇబ్బంది పడే అవకాశం ఉంది.