IPL 2023: ధోని చేసిన పనికి ఎమోషనల్ అయిపోయిన అంబటిరాయుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చైన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై చైన్నై ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ లో ఐదోసారి ట్రోఫీని నెగ్గి రికార్డును సృష్టించింది. ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని తీసుకెళ్లేందుకు వెళ్లిన ధోని చేసిన పని తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ కు ముందు అంబటిరాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెకట్రరీ జైషా చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సిన ధోని.. ఆ బాధ్యతను అంబటిరాయుడికి అప్పగించాడు. దీంతో రాయుడు చాలా ఎమోషన్ అయిపోయాడు. అతనితో పాటు జడేజా కూడా ట్రోఫీపై ఒక చెయ్యి వేసి నవ్వుతూ ట్రోఫీని స్వీకరించాడు.
సోషల్ మీడియాలో ధోనిపై ప్రశంసలు
వేదికపై వెళ్లిన ట్రోఫీని ధోని టచ్ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ధోనీ ఎప్పుడూ క్రెడిట్ తీసుకోడని, తన కష్టం క్రెడిట్ కూడా పక్క వారికే ఇచ్చేస్తాడని ధోని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 214 పరుగులు చేసింది. చైన్నై ఛేజింగ్ మొదలు పెట్టగానే వర్షం మొదలైంది. దీంతో చైన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 172 పరుగులకు కుదించారు. చివరి రెండు బంతుల్లో పది పరుగులు అవసరం కాదా.. జడేజా సిక్సర్, ఫోర్ బాది చైన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.