IPL 2023 : అన్నదమ్ముల మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు అన్నదమ్ములు అమీతూమీ తేల్చుకోనున్నారు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. లక్నో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరం కావడంతో కృనాల్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అటు గుజరాత్ జట్టుకు కృనాల్ సోదరుడు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుత పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. లక్నో మూడోస్థానంలో ఉంది.గుజరాత్ ఏడు విజయాలు నమోదు చేయగా.. లక్నో ఐదు మ్యాచ్ లో విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30గంటలకు ఇరు జట్ల మధ్య పోరు ప్రారంభం కానుంది. ఈ సీజన్లో గత మ్యాచ్ లో లక్నోపై గుజరాత్ ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇరు జట్లలోని సభ్యులు
నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది. ఈ వేదికపై ఈ సీజన్లో ఐదు మ్యాచ్ లు జరగ్గా.. ఛేజింగ్ జట్లు మూడు సార్లు గెలుపొందాయి. గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్ , రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్ లక్నో సూపర్ జెయింట్స్: కైల్ మేయర్స్, వోహ్రా, కృనాల్ పాండ్యా (కెప్టెన్), కరణ్ నాయర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), స్టోయినిస్, కృష్ణప్ప గౌతం, ఆయూష్ బదోని, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మోహ్సిన్ ఖాన్