
RR vs GT: తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.
ఈమ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ బ్యాటర్లు గుజరాత్ బౌలర్ల ధాటికి కుప్పకూలారు. కేవలం 17. 5 ఓవర్లలో 118 పరుగులు చేసి ఆలౌటైంది.
గుజరాత్ బౌలర్లలో రషీద్ మూడు వికెట్లతో విజృంభించాడు. నూర్ మహ్మద్ 2 వికెట్లు, షమీ, హార్ధిక్ పాండ్యా, జోషువా లిటిల్ తలా ఓ వికెట్ తీశారు.
గుజరాత్ బ్యాటర్లు ఏ దశలోనూ రాణించలేకపోయారు. దీంతో స్వల్ప స్కోరుకే చాప చుట్టేశారు.
సంజు శాంసన్ 30, బౌల్ట్ 15, యశస్వీ 14 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు.
Details
రాణించిన గుజరాత్ బ్యాటర్లు
119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ను చేధించింది.
గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా 41 పరుగులు, గిల్ 36 పరుగులు, హార్ధిక్ పాండ్యా 39 పరుగులతో చెలరేగారు.
దీంతో గుజరాత్ కేవలం 13.5 ఓవర్లలోనే విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యుజేంద్ర చాహెల్ ఒక వికెట్ తీసుకున్నారు.