Page Loader
IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్‌పై ఢిల్లీ విజయం సాధించేనా?
ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ

IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్‌పై ఢిల్లీ విజయం సాధించేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2023
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 15న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. బెంగళూర్ మూడు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలై, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఎలాగైనా బెంగళూర్ పై విజయం సాధించి ఐపీఎల్ లో ఖాతా తెరవాలని ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పట్టుదలతో ఉంది. మరోపక్క హోంగ్రౌండ్ లో ఢిల్లీ చిత్తు చేసి ఐపీఎల్ లో రెండో విజయాన్ని నమోదు చేయాలని బెంగళూరు తహతహలాడుతోంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ అనుకూలంగా ఉండనుంది.

ఆర్సీబీ

ఇరు జట్లలోని సభ్యులు

బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకూ 28 మ్యాచ్ లు ఆడగా.. ఇందులో 16 విజయాలను బెంగళూరు సాధించింది. మరో పది మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించింది. గత సీజన్‌లో ఇరు జట్లు ఒకసారి తలపడగా.. ఇందులో ఆర్సీబీ 16 పరుగుల తేడాతో గెలుపొందింది ఆర్సీబీ: విరాట్‌కోహ్లీ, ఫాఫ్ డు‌ప్లెసిస్ (సి), లోమ్రోర్, మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్‌కార్తీక్ (WK), అనుజ్ రావత్, హసరంగా, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, సిరాజ్. ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (సి), మనీష్‌పాండే, యశ్‌ధుల్, రోవ్‌మన్‌పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్), కుల్దీప్‌యాదవ్, అన్రిచ్‌నార్టే, ముస్తాఫిజుర్ రెహమాన్. ఇంపాక్ట్ ప్లేయర్స్: కర్ణ్ శర్మ (RCB), ఖలీల్ అహ్మద్ (DC)