IPL 2023: చైన్నై విజయంతో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చైన్నై విజయం సాధించింది. మొదట చైన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలమై కేవలం 148 పరుగులే చేసింది. దీంతో చైన్నై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. చైన్నై విజయంతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ లు గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైన్నై 12 మ్యాచ్ ల్లో 7 విజయాలను నమోదు చేసి 15 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. ముంబై 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
చివరి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్
లక్నో, రాజస్థాన్, కోల్ కతా నైట్ రైడర్స్ ఐదు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానంలో నిలిచాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్ ను నిలుపుకున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ పరుగులు చేస్తూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 11 మ్యాచ్ ల్లో 576 పరుగులతో ఆరెంజ్ లీడ్ లో ఉన్నాడు. పర్పుల్ క్యాప్ విషయానికొస్తే మహ్మద్ షమీ 19 వికెట్ల తీసి నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో రషీద్ ఖాన్, తుషార్ దేశ్ పాండే నిలిచాడు.