IPL 2023 : సిక్సర్ల వర్షంతో రికార్డులను బద్దలు కొట్టిన సీఎస్కే
ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. రహానే, శివమ్ దూబే తలోఐదు సిక్సర్లు కొట్టగా.. రుతరాజ్, కాన్వే తలో 3, జడేజా రెండు సిక్సర్లను బాదాడు. దీంతో మొత్తం సీఎస్కే 18 సిక్సర్లను కొట్టింది. అంతకముందు తమ పేరిట ఉన్న 17 సిక్సర్ల రికార్డును మళ్లీ చైన్నైనే అధిగమించింది. గతంలో నాలుగుసార్లు 17 సిక్సర్లు కొట్టిన సీఎస్కే.. నిన్నటీ మ్యాచ్ లో ఎట్టకేలకు ఆ మార్కును దాటి సత్తా చాటింది. ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 17 సిక్సర్లు బాదారు.
మరో రికార్డు సాధించిన సీఎస్కే
ఐపీఎల్ లో ఓవరాల్ గా అత్యధిక సిక్సర్ల బాదిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు 2013లో పూణే వారియర్స్ పై ఏకంగా 21 సిక్సర్లు కొట్టి రికార్డుల్లోకెక్కింది. ఇప్పటివరకూ ఈ రికార్డును ఎవరూ టచ్ చేయలేదు. సీఎస్కే కేకేఆర్ పై అత్యధిక స్కోరు(235/4) నమోదు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కు ముందు కేకేఆర్ పై ఢిల్లీ క్యాపిటల్స్(228/4) స్కోరు చేసి రికార్డు సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ పై చైన్నై సూపర్ కింగ్స్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది.