IPL 2023: కోల్‌కతాతో సమరానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని 28వ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైటర్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు సాయంత్రం 7:30గంటలకు ప్రసారం కానుంది. ఈ సీజన్లో ఐదు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకూ ఐపీఎల్ లో ఖాతా తెరవలేదు. కేకేఆర్ కూడా వరుసగా సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్‌తో చేతిలో పరాజయం పాలైంది. అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇరుజట్లు ఐపీఎల్‌లో 30 సార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 16 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
ఢిల్లీ, కోల్ కతా జట్టులోని సభ్యులు వీరే
ఇప్పటికే ఫ్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓడించాలని తహతహలాడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్-కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్. కోల్ కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, ఎన్ జగదీషన్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.