Page Loader
IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి!
ఐపీఎల్ పోరుకు సిద్ధమవుతున్న గుజరాత్ టైటాన్స్

IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది మొదటి సీజన్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఏ మాత్రం అంచనాలు లేకపోయినా ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గతేడాది ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ కప్‌ను సొంతం చేసుకుంది. మరోసారి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గత సీజన్‌లో గుజరాత్ మొదటి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. హార్దిక్ పాండ్య గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌ను ముందుండి నడిపించాడు. 15 మ్యాచ్‌లలో 44.27 సగటుతో 487 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన నాల్గో బ్యాట్‌మెన్స్‌గా నిలిచాడు. మొత్తం 107 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 2,000 పరుగులు పూర్తి చేయడానికి 37 పరుగులు దూరంలో పాండ్యా ఉన్నాడు.

గుజరాత్

కీలక సమయంలో పరుగులు చేస్తున్న బ్యాటర్లు

శుభ్‌మాన్‌గిల్ 16 మ్యాచ్‌లలో 34.50 సగటుతో 483 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధశతకాలు సాధించాడు. ఓపెనర్‌గా గుజరాత్‌కు మంచి అరంభాన్ని అందిస్తున్నాడు. డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా కీలక సమయంలో పరుగులు చేస్తున్నారు. రషీద్ ఖాన్ ఆల్ రౌండర్ ప్రదర్శన జట్టుకు మరింత బలాన్ని అందిస్తోంది. GT జట్టు: హార్దిక్‌పాండ్యా (కెప్టెన్), గిల్, మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, సాహా (Wk), మాథ్యూ‌వేడ్ (Wk), రషీద్‌ఖాన్, తెవాటియా, విజయ్‌శంకర్, షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, విలియమ్సన్, ఓడియన్ స్మిత్, KS భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్ (Wk), జాషువా లిటిల్, మోహిత్‌శర్మ