IPL 2023: గుజరాత్ నుండి శుభ్‌మాన్‌గిల్ తప్పుకుంటున్నాడా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ప్రస్తుతం ఐపీఎల్ 2024పై ఇప్పుడే చర్చలు మొదలవుతున్నాయి. కొన్ని ఫ్రాంచైసీ యజమానులు చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కొంతమంది ఆటగాళ్లు తదుపరి సీజన్ కు ముందే జట్టు నుండి గేట్ పాస్ పొందుతారు. అయితే కొన్ని ఫ్రాంచైసీలు వచ్చే సీజన్ లో స్టార్ ఆటగాళ్లపై కన్నేశాయి. ఈ జాబితాలో ప్రముఖంగా గుజరాత్ స్టార్ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్ పేరు వినిపిస్తోంది.
2023 ఐపీఎల్ సీజన్లో 890 పరుగులు చేసి శుభ్‌మాన్ గిల్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు.
Details
గిల్ పై ఆసక్తి చూపుతున్న పంజాబ్ కింగ్స్?
జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న గిల్ కు గుజరాత్ ఫ్రాంచైసీ కేవలం 8 కోట్ల మాత్రమే ఇస్తోంది. గిల్ జీతం ఇతర ఆటగాళ్ల కంటే చాలా తక్కువని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైసీ ఇషాన్ కిషాన్ కు 15.25 కోట్లు, మరోవైపు సీఎస్కే దీపక్ చాహర్ కు రూ.14 కోట్లు ఇస్తోంది.
గిల్ జీతం తక్కువగా ఉండటంతో కొన్ని ఫ్రాంచైసీలు వచ్చే సీజన్లో అతన్ని వేలానికి తీసుకురావాలని భావిస్తున్నాయి.
ముఖ్యంగా గిల్ ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కు చెందిన గిల్ కు కెప్టెన్సీ ఇస్తే ఇమేజ్ పెరుగుతుందని పంజాబ్ కింగ్స్ భావిస్తోందట.