Page Loader
IPL 2023: భీకర ఫామ్‌లో జోస్ బట్లర్‌.. అర్ష్‌దీప్‌సింగ్ మ్యాజిక్ చేస్తాడా!
సన్ రైజర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన బట్లర్

IPL 2023: భీకర ఫామ్‌లో జోస్ బట్లర్‌.. అర్ష్‌దీప్‌సింగ్ మ్యాజిక్ చేస్తాడా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్‌ల్లో వేర్వేరు జట్లపై విజయం సాధించాయి. ప్రస్తుతం రెండో విజయం కోసం ఇరు జట్లు కన్నేశాయి. ముఖ్యంగా రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ భీకర ఫామ్ లో ఉన్నాడు. సన్ రైజర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 22 బంతుల్లో 54 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అర్షదీప్ సింగ్, నేడు జరిగే మ్యాచ్‌లో బట్లర్ ని ఔట్ చేసి మ్యాజిక్ చేస్తాడో లేదో వేచి చూడాలి

బట్లర్

ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు చేసిన బట్లర్

బట్లర్, అర్ష్‌దీప్ ఇప్పటి వరకూ రెండు ఇన్నింగ్స్‌లో తలపడ్డారు. బట్లర్ 13 బంతుల్లో 15.00 సగటుతో 15 పరుగులు చేశారు. ఇందులో ఐదు సింగిల్స్, ఒక ఫోర్, ఓ సిక్సర్ ఉంది. అర్ష్ దీప్ ఆరు డాట్ బాల్స్ వేసి, ఒకసారి బట్లర్ ని ఔట్ చేశాడు. బట్లర్ 83 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి 40.06 సగటుతో 2,885 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలున్నాయి. అర్షదీప్ 2019లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 38 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్ 24.95 సగటుతో 43 వికెట్లను తీశాడు.