Page Loader
IPL 2023: గుజరాత్ తరుపున అద్భుతంగా రాణించిన నూర్ అహ్మద్ ఎవరు?
అహ్మద్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే సంజూ శాంసన్‌ను అవుట్ చేశాడు

IPL 2023: గుజరాత్ తరుపున అద్భుతంగా రాణించిన నూర్ అహ్మద్ ఎవరు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2023
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ ఐపీఎల్‌లో గుజరాత్ తరుపున అరంగేట్రం చేసిన నూర్ ఆహ్మద్ చక్కగా రాణించాడు. కేవలం 2.2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చినప్పటికీ.. కెప్టెన్ సంజు శాంసన్ వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 177/7 స్కోరు చేసింది. తర్వాత అహ్మద్ రెండవ ఇన్నింగ్స్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా మైదానంలోకి అడుగు పెట్టాడు.15 ఓవర్లో బంతిని అందుకున్న నూర్‌ఆహ్మద్ చివరి బంతికి సంజు శాంసన్ వికెట్ ను తీశాడు. ఆప్ఘనిస్తాన్‌కు చెందిన నూర్‌ఆహ్మద్ 2019లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ అతన్ని రూ. 30లక్షలకు కొనుగోలు చేసింది.

నూర్ ఆహ్మద్

2019లో అండర్-19 జట్టులోకి ప్రవేశించిన నూర్ ఆహ్మద్

2019లో నూర్ ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 జట్టులోకి ప్రవేశించాడు. అతను 2020 ICC అండర్-19 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ చెందిన 15 మంది సభ్యుల జట్టులో ఒకరిగా ఎంపికయ్యాడు. అహ్మద్ గత సంవత్సరం జింబాబ్వేపై తన T20I అరంగేట్రం చేశాడు. నవంబరు 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో అహ్మద్ నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్థాన్ బ్యాటర్ హెట్మెయర్ చివర్లో 56 పరుగులు రాణించడంతో 19.2 ఓవర్లలోనే రాజస్థాన్ లక్ష్యాన్ని చేధించింది.