IPL 2023: మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ రాణిస్తాడా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 54వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్ తలపడనుంది. గత మ్యాచ్‌లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలుపొందింది. దీంతో ఎలాగైనా వాంఖడే స్టేడియంలో ఆర్సీబీని ఓడించాలని ముంబై గట్టి పట్టుదలతో ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇషాన్ కిషాన్ను సిరాజ్ రెండుసార్లు ఔట్ చేశాడు. సిరాజ్ పై కిషాన్ 117.24 స్ట్రైక్ రేట్ తో మాత్రమే పరుగులు చేశాడు. RCBతరపున పవర్‌ప్లేలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో ఎనిమిది వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. అతను తర్వాత షమీ 12 వికెట్లతో ముందుస్థానంలో ఉన్నాడు.
కిసాన్ సాధించిన రికార్డులివే
ప్రస్తుత సీజన్‌లో కిషన్ పవర్‌ప్లేలో 67.33 సగటుతో 202 పరుగులు చేశాడు. కిషన్ ఐపీఎల్‌లో 76 ఇన్నింగ్స్‌లో పేసర్ల చేతిలో 43సార్లు ఔట్ అయ్యాడు. మొత్తంగా 1,267 పరుగులను సాధించాడు. సిరాజ్ 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎంఐపై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ 75 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 30.21 సగటుతో 74 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీశాడు. కిషన్ 85 ఐపీఎల్ మ్యాచ్‌లో 29.23 సగటుతో 2,163 పరుగులను చేశాడు.