Page Loader
IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్ 
IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్

IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్ 

వ్రాసిన వారు Stalin
Feb 10, 2024
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడబోతున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. జోసెఫ్‌ ఐపీఎల్‌లో ఆడటం ఇదే తొలిసారి. లక్నో యాజమాన్యం అతన్ని మార్క్ వుడ్ స్థానంలో జట్టులోకి తీసుకుంది. ఈ కరీబియన్ ఫాస్ట్ బౌలర్‌కు మేనేజ్‌మెంట్ రూ. 3 కోట్లు చెల్లించింది. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జోసెఫ్ అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా అతనికి మంచి గుర్తింపు దక్కింది.

ఐపీఎల్

ఇప్పటి వరకు రెండు టీ 20లు మాత్రమే ఆడిన జోసఫ్

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 24 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ కేవలం రెండు T20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అయితే తన ఫాస్ట్ పేస్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. గబ్బా వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో జోసెఫ్ 7 వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్‌లో 5 వికెట్లు తీసుకోవడం ఇదే మొదటిసారి. అతని పదునైన బౌలింగ్ కారణంగా కంగారూ జట్టు 216 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకుముందు అడిలైడ్‌లో జరిగిన టెస్టులో అతను మొత్తం 5 వికెట్లు (5/94 మరియు 0/7) తీసుకున్నాడు.