
MS Dhoni: ఐపీఎల్ 2025.. ధోనీని రిటైన్ చేసేందుకు CSK సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మళ్లీ ఎంఎస్ ధోని చోటు సంపాదించనున్నట్లు సమాచారం.
ఈ సీజన్ కోసం ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుతారని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ప్రకటించారు.
ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంటే, చెన్నైకి మిగతా ఐదు స్టార్ ప్లేయర్లను కూడా జట్టులో ఉంచుకోవడానికి అవకాశం ఉంది.
ధోని ఐపీఎల్ 2025లో ఆడుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతనిని రిటైన్ చేసేందుకు సీఎస్‌కేకు కేవలం రూ.4 కోట్లే ఖర్చు చేసింది.
Details
అన్‌క్యాప్‌డ్ జాబితాలో ధోని
ఐపీఎల్ మెగా వేలం నిబంధనల ప్రకారం, ఐదు సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచవచ్చు.
ధోనీ రిటైర్మెంట్ అనంతరం ఈ నిబంధన ప్రకారం, అతడు అన్‌క్యాప్‌డ్ జాబితాలో చేరడం ఖాయమైంది.
దీంతో ధోనీని ఐపీఎల్ 2025లో కూడా చూస్తామని నిర్ధారణ కావడం అభిమానులకు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.