
IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.
దీంతో వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను తిరిగి ప్రారంభించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలు ప్రారంభించింది.
ఈ మేరకు బీసీసీఐ నేడు (మే 11న) ఫ్రాంఛైజీల యజమానులు, వాటాదారులతో సమావేశం నిర్వహించనుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌కు వారం రోజుల విరామం లభించింది.
ఈ సమయంలో పలువురు విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది స్వదేశాలకు వెళ్లిపోయారు.
టోర్నీ పునఃప్రారంభమవుతుందని తెలిసిన వెంటనే వారు తిరిగి భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
Details
విదేశీ ఆటగాళ్ళు టోర్నీ ఆడతారు
'విదేశీ ఆటగాళ్లు మళ్లీ ఇండియాకి వచ్చి టోర్నీలో పాల్గొనతారన్న నమ్మకం ఉంది.
వారం రోజుల విరామం కారణంగా వారు తమ కుటుంబాలతో గడపాలని కోరుకున్నారు. మేం సమీక్ష నిర్వహించి తదనుగుణంగా ఫ్రాంఛైజీలకు సమాచారం అందిస్తామని ధుమాల్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మిగిలిన మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐని సంప్రదించినట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు.
'అలాంటి వార్తలు వినబడ్డా.. కానీ బీసీసీఐ ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదు. ఇతర దేశాలు ఈ టోర్నీ నిర్వహించేందుకు ఉత్సాహం చూపడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్ సహా మిగిలి ఉన్నాయి. వీటిని భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తోంది.