
IPL 2025 Recap: ఐపీఎల్ 2025 హైలైట్స్.. 14ఏళ్ల క్రికెటర్ నుంచి చాహల్ హ్యాట్రిక్ దాకా!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ జోష్ అందుకోనుంది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఈ సీజన్ మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) మధ్య జరిగే మ్యాచ్‌తో పునఃప్రారంభం కానుంది.
ఇప్పటికే ఈ సీజన్‌లో అనేక సంచలన ఘటనలు చోటుచేసుకున్నాయి. 14 ఏళ్ల కుర్రాడి శతకం, చాహల్ హ్యాట్రిక్, సూపర్ ఓవర్లు ఇలా ఎన్నో ఉత్కంఠ క్షణాలు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాయి.
అనూహ్యంగా అగ్రస్థానాల్లోకి
ఇప్పటివరకు పెద్దగా అంచనాలు లేని పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈసారి అత్యుత్తమ ప్రదర్శనలతో అందర్నీ ఆశ్చర్యపరిచాయి.
పంజాబ్ ఇప్పటివరకు 7 విజయాలతో ప్లేఆఫ్స్‌కి దగ్గరగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో పోటీగా నిలుస్తోంది.
Details
14 ఏళ్ల 'వైభవం'
ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం - 14 ఏళ్ల టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే అద్భుతంగా రాణించాడు.
గుజరాత్ టైటాన్స్‌పై 38 బంతుల్లో 101 పరుగులతో ధాటిగా ఆడి తన తొలి శతకాన్ని నమోదు చేశాడు.
17 బంతుల్లో హాఫ్ సెంచరీ, 35 బంతుల్లోనే శతకం బాదిన అతడు గేల్ తర్వాత అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
చాహల్ హ్యాట్రిక్ ఘనత
పంజాబ్ కింగ్స్ తరఫున చెన్నైపై చాహల్ హ్యాట్రిక్ తీసి మరోసారి తన క్లాస్ నిరూపించాడు.
ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్ల జాబితాలో చేరాడు.
Details
ఉత్కంఠ పోరాటాలు.. సూపర్ ఓవర్లు
ఈ సీజన్‌లో ఉత్కంఠ భరిత మ్యాచ్‌లు మోజు చూపిస్తున్నాయి. సన్‌రైజర్స్ 245 పరుగుల లక్ష్యాన్ని చేధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రాజస్థాన్, ఢిల్లీ మధ్య జరిగిన ఓ మ్యాచ్ సూపర్ ఓవర్‌కి వెళ్ళింది. చివరికి ఢిల్లీ విజయం సాధించింది.
అద్భుతంగా పుంజుకున్న ముంబయి
తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటములు చవిచూసిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా ఆరు విజయాలతో తిరిగి పుంజుకుని ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చేసింది.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలో మళ్లీ టైటిల్ పోరులో ముంబయి ముందంజ వేసింది.
Details
సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం
ధర్మశాల వేదికగా మే 8న జరిగిన మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
ఫ్లడ్‌లైట్లు ఆపివేసి ప్రేక్షకులు, ఆటగాళ్లను సురక్షితంగా తరలించారు. పరిస్థితులు మెరుగుపడటంతో మే 17 నుంచి ఐపీఎల్‌ను మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.