IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. 65 రోజుల్లో మొత్తం 74 మ్యాచులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
ఈ సీజన్ మార్చి 22, 2025 నుండి ప్రారంభమై, మే 25, 2025 వరకు కొనసాగుతుంది. మొత్తం 74 మ్యాచ్‌లు 65 రోజుల పాటు నిర్వహించనున్నారు.
మొదటి మ్యాచ్ మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది.
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహా మొతత్ం 10 జట్లు పాల్గొంటున్నాయి
మ్యాచ్‌లు హోమ్-అవే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.
Details
మే 25న ఫైనల్ మ్యాచ్
అంటే ప్రతి జట్టు తమ హోమ్ గ్రౌండ్‌లో, ప్రత్యర్థి హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడుతుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త కెప్టెన్‌గా రాజత్ పటిదార్ ఎంపికయ్యారు.
ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో ఈ బాధ్యతలను స్వీకరించారు.
అలాగే, రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు, కేఎల్ రాహుల్ స్థానంలో ఈ బాధ్యతలను చేపట్టారు. మొత్తం 74 మ్యాచ్‌లు 65 రోజుల పాటు నిర్వహించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూర్తి షెడ్యూల్ ఇదే
IPL 2025 SCHEDULE. pic.twitter.com/QpEQ7DcE9d
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2025