LOADING...
IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్
ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 19, 2026
11:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మంచి ఆరంభం లభించింది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తన తొలి ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపి పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. దీంతో లక్నో శిబిరంలో ఆనందం నెలకొంది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. క్రీజులోకి వచ్చిన ప్రియాంష్ ఆర్య, కూపర్ కానలీ లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానం అంతా షేక్ చేస్తూ స్కోరు వేగంగా పెంచారు.

వివరాలు

అత్యంత దారుణమైన ఓవర్ ఇదేనా?

ఇక మ్యాచ్‌లో 13వ ఓవర్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ బంతిని ఆస్ట్రేలియా బౌలర్ మార్క్రామ్ చేతికి ఇచ్చాడు. అప్పటికే మంచి టచ్‌లో ఉన్న పంజాబ్ బ్యాటర్లు అతనిపై పూర్తిగా విరుచుకుపడ్డారు. కూపర్ కానలీ వరుసగా తొలి మూడు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఒక వైడ్, తదుపరి బంతికి సింగిల్ వచ్చింది. కానీ ఓవర్ చివరి రెండు బంతుల్లో ప్రియాంష్ ఆర్య వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఒక్క ఓవర్‌లోనే మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఇది ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్‌లో నమోదైన అత్యంత దారుణమైన ఓవర్లలో ఒకటిగా నిలిచింది.

Advertisement