IPL 2026: ఎట్టకేలకు ముంబై విజయం.. గుజరాత్ పై 99 పరుగుల తేడాతో ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఈ జట్టు విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై అద్భుతంగా రాణించి ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
వివరాలు
గుజరాత్‌ను మట్టికరిపించారిలా..
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమైంది. 15.2 ఓవర్లలో కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబై 99 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ముంబైకి ఇది రెండో విజయం కావడం విశేషం. మరోవైపు వరుసగా మూడు విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్‌కు ముంబై షాక్ ఇచ్చింది. ఈ ఓటమితో గుజరాత్ ఈ సీజన్‌లో మూడో పరాజయాన్ని నమోదు చేసింది.
వివరాలు
తిలక్ వర్మ అద్భుత సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన వర్మ అద్భుతంగా ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి జట్టును భారీ స్కోర్ వైపు నడిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. అతని దూకుడుతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది.