LOADING...
IPL 2026: 'మాకూ వచ్చింది గ్లామర్ క్వీన్'.. కావ్య మారన్ తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అనన్య బిర్లా!
'మాకూ వచ్చింది గ్లామర్ క్వీన్'.. కావ్య మారన్ తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అనన్య బిర్లా!

IPL 2026: 'మాకూ వచ్చింది గ్లామర్ క్వీన్'.. కావ్య మారన్ తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అనన్య బిర్లా!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 26, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు బ్రిటన్‌కు చెందిన డియాజియో సంస్థ ఆధీనంలో ఉన్న ఈ జట్టును, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కన్సార్టియం సుమారు రూ.16,700 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో ఆర్సీబీ పురుషుల, మహిళా జట్ల నిర్వహణ బాధ్యతలు బిర్లా కుటుంబానికి మారనున్నాయి. కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇదిలా ఉంటే, ఆయన సోదరి అనన్య బిర్లా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచారు.

వివరాలు 

కావ్య మారన్‌కు పోటీగా అనన్య బిర్లా

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు కావ్య మారన్ ఎలాంటి గుర్తింపు తెచ్చారో అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు ఆర్సీబా జట్టుకు అనన్య బిర్లా కూడా అలాంటి ప్రత్యేక గుర్తింపును తీసుకురావచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా, సన్ రైజర్స్‌కు కావ్య మారన్ గ్లామర్ అట్రాక్షన్‌గా నిలిచినట్లే, ఇకపై ఆర్సీబీ మ్యాచ్‌లలో అనన్య బిర్లా స్టేడియంలో ప్రత్యక్షమై జట్టుకు మద్దతు ఇస్తారని సమాచారం. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో "మా జట్టుకూ ఓ గ్లామర్ స్టార్ వచ్చేసింది" అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

అనన్య బిర్లా ఎవరో తెలుసా?

అనన్య బిర్లా కేవలం వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు, అనేక రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్న బహుముఖ వ్యక్తిత్వం కలిగిన మహిళ. ఆమె 17 ఏళ్ల వయసులోనే 'స్వతంత్ర మైక్రోఫైనాన్స్' సంస్థను ప్రారంభించి, గ్రామీణ మహిళలకు ఆర్థిక సహాయం అందించే దిశగా ముందడుగు వేశారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్‌లో పలు ముఖ్యమైన వ్యాపార విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, అనన్య బిర్లా అంతర్జాతీయ స్థాయిలో పాప్ సింగర్‌గా కూడా గుర్తింపు పొందారు. సంగీత రంగంలో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత అభిమాన వర్గం ఉంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు "ఎమ్ పవర్" అనే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.

Advertisement

వివరాలు 

RCBలో అనన్య పాత్ర ఎలా ఉండొచ్చు?

గతంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు మద్దతు తెలిపిన అనన్య బిర్లా, ఇప్పుడు తన కుటుంబానికి చెందిన జట్టు కావడంతో ఆర్సీబీ కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్యమన్ బిర్లా వ్యూహాత్మక నిర్ణయాలను చూసుకుంటే, అనన్య బిర్లా బ్రాండ్ అంబాసిడర్‌గా జట్టుకు ప్రతినిధిగా నిలవవచ్చని అంచనాలు ఉన్నాయి. ఆమె స్టేడియంలో హాజరవుతుండటంతో ఐపీఎల్‌కు మరింత ఆకర్షణ పెరుగుతుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. దీంతో అనన్య బిర్లా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్లలో పెరుగుతోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్: 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనన్య బిర్లా గురించి వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement