LOADING...
IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? చెపాక్‌లో చెన్నై మళ్లీ గెలుస్తుందా?
కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? చెపాక్‌లో చెన్నై మళ్లీ గెలుస్తుందా?

IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? చెపాక్‌లో చెన్నై మళ్లీ గెలుస్తుందా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 14, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో మరో రసవత్తరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మంగళవారం రాత్రి చెపాక్ మైదానంలో తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని కోల్‌కతా జట్టు, ఈ మ్యాచ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించి ఖాతా తెరవాలని చూస్తోంది. ఇక చెన్నై జట్టు మాత్రం వరుసగా రెండో గెలుపుతో తిరిగి ఫామ్‌లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలం, బలహీనతలు, గణాంకాలు ఒకసారి చూద్దాం.

వివరాలు

20 సార్లు విజయం..

ఐపీఎల్ చరిత్రలో చెన్నై, కోల్‌కతా జట్లు ఇప్పటివరకు మొత్తం 31 మ్యాచ్‌లు ఆడాయి. అందులో చెన్నై 20 సార్లు విజయం సాధించి ఆధిక్యంలో ఉంది. ప్రస్తుత సీజన్‌లో చెన్నై 9వ స్థానంలో ఉండగా, కోల్‌కతా 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ శతకం సాధించి అద్భుతంగా రాణించాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, శివమ్ దూబే కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తే చెన్నై బ్యాటింగ్ మరింత బలపడుతుంది.

వివరాలు

తుది జట్టులోకి వస్తాడా? 

గాయం కారణంగా దూరంగా ఉన్న కోల్‌కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీఎస్కేపై అతనికి మంచి రికార్డు ఉంది. 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. చెపాక్ మైదానం అతనికి సొంత మైదానం కావడం కూడా అతనికి అనుకూలం. అయితే అతడిని తుది జట్టులో తీసుకుంటారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఇక శ్రీలంకకు చెందిన మతీషా పతీరణ కూడా ఈ మ్యాచ్‌కు జట్టులో చేరే అవకాశముంది. మరోవైపు కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అతని ఎకానమీ కేవలం 3 మాత్రమే ఉండటం గమనార్హం.

Advertisement

వివరాలు

తుది జట్లు ఇవే..

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌ ఆయుష్‌ మాత్రే, సర్ఫరాజ్‌ ఖాన్‌, బ్రేవిస్‌, శివమ్‌ దూబే, జేమీ ఓవర్టన్‌, నూర్‌ అహ్మద్‌, ఖలీల్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్‌, గుర్జాప్నీత్ సింగ్‌ కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానె (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, కామెరూన్‌ గ్రీన్‌, అంగ్‌క్రిష్‌ రఘువంశి, రింకు సింగ్‌, రోమన్‌ పోవెల్, రమణ్‌దీప్‌ సింగ్‌, అనుకుల్‌ రాయ్‌, సునీల్‌ నరైన్‌, నవదీప్‌ సైనీ, కార్తిక్‌ త్యాగి

Advertisement