LOADING...
IPL 2026: ఆ ఐదుగురు ఆటగాళ్లతో లక్నో బంధం ముగియనుందా?
ఆ ఐదుగురు ఆటగాళ్లతో లక్నో బంధం ముగియనుందా?

IPL 2026: ఆ ఐదుగురు ఆటగాళ్లతో లక్నో బంధం ముగియనుందా?

వ్రాసిన వారు Moogati Shabari
May 24, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్జెయింట్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన లక్నో జట్టు కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి, తొమ్మిది పరాజయాలను ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. జట్టు ప్రదర్శనపై ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో వచ్చే మెగా వేలానికి ముందు జట్టులో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్న ఐదుగురు ఆటగాళ్లపై ఓసారి దృష్టి పెడదాం.

వివరాలు

రిషబ్ పంత్ (రూ.27 కోట్లు)

ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన పేరు జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ది. ఐపీఎల్ 2026 వేలంలో లక్నో ఫ్రాంచైజీ అతడిని రూ.27 కోట్ల భారీ మొత్తంతో తమ జట్టులోకి తీసుకుంది. అదే సమయంలో నాయకత్వ బాధ్యతలను కూడా అప్పగించింది. అయితే కెప్టెన్‌గా మాత్రమే కాకుండా బ్యాటర్‌గా కూడా పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 28 సగటుతో, 140 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 312 పరుగులు మాత్రమే సాధించాడు. భారీ ధరకు తీసుకున్న ఆటగాడు నిరాశపరచడంతో, వచ్చే సీజన్‌కు ముందు లక్నో అతడిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు

విధ్వంసకర బ్యాటర్ దూరం కానున్నాడా?

విధ్వంసకర బ్యాటింగ్‌కు పేరుగాంచిన నికోలస్ పూరన్‌కు ఈ సీజన్ కలిసిరాలేదు. సాధారణంగా సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అతడు, ఈసారి పరుగుల కోసం తంటాలు పడ్డాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 234 పరుగులు మాత్రమే చేసి, 19 సగటుతో నిరాశపరిచాడు. స్టార్ ప్లేయర్‌గా భారీ అంచనాలు పెట్టుకున్న లక్నో యాజమాన్యం, అతడి ఫామ్ దృష్ట్యా పర్స్‌ను సమతుల్యం చేసుకునేందుకు విడుదల చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

వివరాలు

ఆవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు)

ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్‌పై లక్నో ఫ్రాంచైజీ భారీగా పెట్టుబడి పెట్టినా, అతడు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అవేశ్ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అతడి బౌలింగ్ సగటు 45.50గా ఉండగా, ఎకానమీ రేట్ కూడా ఓవర్‌కు 11 పరుగులకు పైగానే నమోదైంది. ఈ గణాంకాలు జట్టు యాజమాన్యాన్ని నిరాశపరిచినట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు

అన్రిచ్ నోర్కియా (రూ.2 కోట్లు)..

దక్షిణాఫ్రికాకు చెందిన వేగవంతమైన బౌలర్ అన్రిచ్ నోర్కియాను లక్నో జట్టు రూ.2 కోట్లకు దక్కించుకుంది. అయితే గాయాలు, ఫామ్ లోపం కారణంగా అతడు ఎక్కువ మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. మొత్తం సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం లభించగా, అందులో కూడా వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. దీంతో అతడి భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

వివరాలు

దిగ్వేష్ రాఠీ (రూ.30 లక్షలు)

డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన దిగ్వేష్ రాఠీని లక్నో జట్టు రూ.30 లక్షల బేస్ ధరకు తీసుకుంది. తక్కువ ధరకే వచ్చినప్పటికీ అతడిపై జట్టు యాజమాన్యం మంచి ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన దిగ్వేష్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. దీంతో అతడిని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఐదుగురు ఆటగాళ్లను వచ్చే సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది.

Advertisement