LOADING...
IPL 2026 : ఐపీఎల్‌లో 8వ మ్యాచ్ .. ఢిల్లీతో తలపడనున్న ముంబై
ఐపీఎల్‌లో 8వ మ్యాచ్ .. ఢిల్లీతో తలపడనున్న ముంబై

IPL 2026 : ఐపీఎల్‌లో 8వ మ్యాచ్ .. ఢిల్లీతో తలపడనున్న ముంబై

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్లో 8వ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. శనివారం ఈ మ్యాచ్ న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లూ విజయాలతో ఆరంభించినప్పటికీ ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

వివరాలు 

బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ముంబై 

అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీల కారణంగా హై స్కోరింగ్ మ్యాచ్‌లకు అవకాశం ఉంది. ఇక్కడ 200 పైగా పరుగులు చేసినా సేఫ్ కాదు. ఇదే ముంబైకి ప్లస్ పాయింట్. ఈ సీజన్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్‌తో ముంబై దిగుతోంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 221 పరుగులను ఛేజ్ చేయడం వారి సామర్థ్యాన్ని చూపించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ మంచి ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు జట్టుకు బలమైన బ్యాటింగ్ అందించనున్నారు.

వివరాలు 

ఢిల్లీ బ్యాటింగ్‌పై సందేహాలు

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లో గెలిచినా, వారి బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది. లక్నోపై మ్యాచ్‌లో 142 పరుగుల ఛేజ్‌లో 26/4కి పడిపోవడం బలహీనతను చూపించింది. రాహుల్ డక్ అవ్వగా, కెప్టెన్ అక్షర్ పటేల్, పథుం నిస్సాంకా, నితీష్ రాణా కూడా పవర్‌ప్లేలో ఔటయ్యారు. ముంబై బౌలర్లు బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ మొదటి ఓవర్లలో దాడి చేస్తే మరోసారి టాప్ ఆర్డర్ కుప్పకూలే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

జట్ల వివరాలివే..

ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పథుం నిస్సాంకా, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్. ముంబై ఇండియన్స్: రియన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

Advertisement