IPL 2026: రాజస్థాన్ రాయల్స్ విక్టరీ..పోరాడి ఓడిన ముంబై
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొదట టాస్ ఓడిన రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీగా 150 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లపై దాడి చేస్తూ అద్భుతంగా ఆడాడు.
వివరాలు
వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబై
తర్వాత 151 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభం ఆశించినంతగా లేకపోయింది. 8 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్, జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అనంతరం 6 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, బర్గర్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. తరువాత 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సందీప్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో ముంబై మూడో వికెట్‌ను కోల్పోయింది.
వివరాలు
రాజస్థాన్ విజయం సాధించిందిలా..
ఒకే ఓవర్‌లో ముంబై రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రవిబిష్ణోయ్ వేసిన ఐదో ఓవర్‌లో మూడో బంతికి హార్దిక్ పాండ్యా (9) ఔటవగా, అదే ఓవర్ చివరి బంతికి తిలక్ వర్మ (1) కూడా పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై జట్టు 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేసింది. రూథర్‌ఫోర్డ్ రూపంలో ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. అతను 25 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం నమన్ ధీర్ అవుట్ కావడంతో ముంబై ఏడో వికెట్ కూడా కోల్పోయింది. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 123 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది