LOADING...
Mohammad kaif: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద పొరపాటు.. ఢిల్లీ నిర్ణయంపై మహమ్మద్ కైఫ్ తీవ్ర విమర్శలు
ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద పొరపాటు.. ఢిల్లీ నిర్ణయంపై మహమ్మద్ కైఫ్ తీవ్ర విమర్శలు

Mohammad kaif: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద పొరపాటు.. ఢిల్లీ నిర్ణయంపై మహమ్మద్ కైఫ్ తీవ్ర విమర్శలు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 20, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా, ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి చర్చలు మాత్రం ఇప్పటికే ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో లక్నో సూపర్ జాయింట్స్ నుంచి రిషభ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ట్రేడ్ చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమవుతోందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రతిపాదిత నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది ఢిల్లీ ఫ్రాంచైజీ చేసే అత్యంత పెద్ద పొరపాటు అవుతుందని వ్యాఖ్యానించాడు.

వివరాలు

సంచలనం రేపుతున్న ట్రేడ్ చర్చలు..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్‌తో ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే, వచ్చే సీజన్‌కు సంబంధించి జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. గత సీజన్‌లో లక్నో సూపర్ జాయింట్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రిషభ్ పంత్ కెప్టెన్సీకి కూడా వైదొలిగాడు. దీంతో తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి తిరిగి రావాలని ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ట్రేడింగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కుల్దీప్ యాదవ్‌తో పాటు అదనంగా రూ.15 కోట్ల నగదును కూడా లక్నోకు ఇవ్వడానికి సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. రూ.27 కోట్ల విలువైన రిషభ్ పంత్‌ను తిరిగి దక్కించుకోవడానికి కుల్దీప్‌ను వదులుకోవాలనే ఆలోచనపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

వివరాలు

ఒక్క సీజన్ ఆధారంగా ఆటగాడిని అంచనా వేయడం సరికాదు..

ఈ ట్రేడింగ్ వార్తలపై మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాడు. "ఢిల్లీ క్యాపిటల్స్ నిజంగానే కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు పంపాలని నిర్ణయిస్తే, అది ఆ జట్టు చేసే అత్యంత పెద్ద తప్పిదంగా నిలుస్తుంది. ఒక ఆటగాడి సామర్థ్యాన్ని కేవలం ఒక్క సీజన్ ప్రదర్శన ఆధారంగా నిర్ణయించడం సరైన విధానం కాదు. దాదాపు పదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అనుభవజ్ఞుడైన ఆటగాడిని తాత్కాలిక ఫామ్‌తో కొలవకూడదు. ఢిల్లీ కొత్త హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ కూడా ఎప్పుడూ ఇదే విషయాన్ని చెబుతుంటారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఢిల్లీ యాజమాన్యం తీసుకుంటున్న వైఖరి ఆందోళన కలిగిస్తోంది" అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

Advertisement