LOADING...
Rishabh Pant Fined : గెలుపు ఆనందంలో లక్నోకు షాక్.. రిషబ్ పంత్‌పై ఫైన్
గెలుపు ఆనందంలో లక్నోకు షాక్.. రిషబ్ పంత్‌పై ఫైన్

Rishabh Pant Fined : గెలుపు ఆనందంలో లక్నోకు షాక్.. రిషబ్ పంత్‌పై ఫైన్

వ్రాసిన వారు Moogati Shabari
May 16, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

శుక్రవారం ఎకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్జెయింట్స్ విజయం సాధించింది. అయితే ఈ విజయానందంలో ఉన్న లక్నో జట్టుకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్ నిర్వాహకులు భారీ మొత్తంలో జరిమానా విధించారు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో స్లో ఓవర్ రేట్ నమోదైంది. ఇదే జరిమానాకు కారణమైంది.

వివరాలు

కెప్టెన్ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా..

ఈ సీజన్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడటం ఇదే మొదటిసారి కావడంతో రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇక మళ్లీ ఇదే తప్పు పునరావృతమైతే పరిస్థితి మరింత కఠినంగా మారనుంది. రెండోసారి కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే కెప్టెన్ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధించడంతో పాటు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని మిగతా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు — వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా వసూలు చేస్తారు.

వివరాలు

నిబంధనలు ఉల్లంఘించిన లక్నో..

ఈ విషయంపై ఐపీఎల్ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో, "ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరిగిన 54వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కనీస ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది ఈ సీజన్‌లో జట్టు చేసిన తొలి తప్పిదం కావడంతో కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం" అని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

Advertisement

వివరాలు

లక్నో ఇన్నింగ్స్ సాగిందిలా..

జట్టులో కార్తీక్ శర్మ 42 బంతుల్లో 71 పరుగులు చేసి ఆకట్టుకోగా, శివమ్ దూబే 16 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా, షమీ, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ సాధించారు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 90 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, నికోలస్ పూరన్ 17 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ చెరో వికెట్ తీశారు.

Advertisement