RR vs DC : జడేజా-కుల్దీప్ మధ్య సరదా వాగ్వాదం.. వైరల్ వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడిన మ్యాచ్‌లో ఒక సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ తరఫున రవీంద్ర జడేజా, ఢిల్లీ తరఫున కుల్దీప్ యాదవ్ ఆడుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ మధ్యలో రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో జడేజా, కుల్దీప్ మధ్య జరిగిన సరదా వాగ్వాదం అభిమానులను ఆకట్టుకుంది.
వివరాలు
అసలు ఏం జరిగిందంటే?
రాజస్థాన్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో 12వ ఓవర్‌లో ధ్రువ్ జురెల్ ఔటయ్యాడు. ఆ సమయంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ కోసం మైదానంలోకి వచ్చాడు. అతను క్రీజ్ వైపు వస్తుండగా కుల్దీప్ యాదవ్ ఎదురుపడ్డాడు. ఈ క్రమంలో జడేజా సరదాగా కుల్దీప్‌ను భయపెట్టేందుకు తన బ్యాట్‌తో కొడుతున్నట్లు హావభావం చేశాడు. అయితే కుల్దీప్ మాత్రం ఏమాత్రం స్పందించకుండా, జడేజా భుజంపై చేయి వేసి "ఏం ఆడతావు లే, వెళ్లిపో" అన్నట్లు సరదాగా అతడిని పక్కకు తోసేశాడు. అనంతరం జడేజా బ్యాట్‌ను అంపైర్ గేజ్ ద్వారా చెక్ చేస్తున్న సమయంలో కూడా కుల్దీప్ మరోసారి అతడిని నెట్టి సరదాగా స్పందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వివరాలు
మ్యాచ్ విషయానికి వస్తే..
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. జట్టులో రియాన్ పరాగ్ 90 పరుగులు (50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి అద్భుతంగా రాణించాడు. ధ్రువ్ జురెల్ 42 పరుగులు చేశాడు. చివర్లో డోనోవన్ ఫెరెరా 47 పరుగులు నాటౌట్‌గా (14 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసుకోగా, కైల్ జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలా ఒక వికెట్ సాధించారు. తరువాత 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
OMG 😱 War between Kuldeep Yadav & Ravindra Jadeja 😭#DCvsRR #RRvsDC
— Rolex x👑 (@Tfg85743663) May 1, 2026
Kyle Jamieson #Peddi
Riyan Paragpic.twitter.com/ZZNhckDYMN