SRH: వరుస వివాదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బీసీసీఐకి ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకదాంట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అయితే ఫలితాల కంటే ఎక్కువగా ఈ మూడు మ్యాచ్‌ల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు జట్టులో అసంతృప్తిని పెంచాయి. ముఖ్యంగా కీలక సమయాల్లో అంపైర్లు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల తమకు నష్టం జరిగిందని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారికంగా ఫిర్యాదు చేయాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
క్లాసెన్ వికెట్‌పై అనుమానాలు..
సీజన్ ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ అవుట్‌పై పెద్ద చర్చ నెలకొంది. ఫిలిప్ సాల్ట్ బౌండరీ వద్ద అందుకున్న క్యాచ్ సమయంలో అతని కాలు కుషన్‌ను తాకినట్లు రీప్లేల్లో కనిపించినప్పటికీ, థర్డ్ అంపైర్ దాన్ని అవుట్‌గా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ క్యాచ్ సిక్సర్‌గా పరిగణించబడినట్లయితే మ్యాచ్ ఫలితం మారిపోయేదని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ఆ క్యాచ్‌పై వివాదం..
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఔట్ అయిన తీరు కూడా చర్చనీయాంశమైంది. వరుణ్ చక్రవర్తి తీసుకున్న క్యాచ్ నేలకు తగిలిందా అనే అనుమానం వ్యక్తమైంది. ఈ విషయంపై అభిషేక్ శర్మ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేయగా, అతనికి జరిమానా విధించారు. జట్టు మ్యాచ్ గెలిచినప్పటికీ, సరైన నిర్ణయం తీసుకోలేదని మేనేజ్‌మెంట్ అసహనం వ్యక్తం చేస్తోంది.
వివరాలు
నిబంధనల ఉల్లంఘన..
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో మరింత వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చివరి ఓవర్లో లక్నో బ్యాటర్ కొట్టిన బంతి బౌండరీ లైన్ దాటకముందే, డగౌట్‌లో ఉన్న ఆవేశ్ ఖాన్ బయట నుంచి దానిని తాకాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది 'అన్‌ఫెయిర్ ప్లే'గా పరిగణించాలి. ఈ పరిస్థితిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐదు పరుగులు పెనాల్టీగా ఇవ్వాల్సి ఉండగా, అంపైర్లు ఈ అంశాన్ని గమనించలేదు. ఈ పరిణామాలన్నింటిపై స్పష్టత కోరుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ త్వరలోనే బీసీసీఐకి లేఖ రాసే అవకాశమున్నట్లు సమాచారం.