
IPL: పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న వేళ.. కొన్ని ఫ్రాంచేజీలకు ఊహించిన షాక్‌లు తగులుతున్నాయి. గాయాల వల్ల, కొన్ని ఇతర కారణాలతో అయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఐపీఎల్ మొత్తం సీజన్ కు దూరమవుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు కూడా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు మొత్తం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఈ ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్ సమయానికి మరింత ఫిట్ గా ఉండాలనే ఉద్ధేశంతో బెయిర్ స్టో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఐపీఎల్ 16వ సీజన్ కి దూరం కావాలని అతడు డిసైడ్ అయ్యాడని తెలిసింది.
పంజాబ్ కింగ్స్
ఐపీఎల్‌లో జానీ బెయిర్‌స్టో సాధించిన రికార్డులివే
ఐపీఎల్ 2022 వేలంలో బెయిర్‌స్టోను పంజాబ్ కింగ్స్ రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అతడు సెప్టెంబర్ 2022లో కాలుకు శస్ర్త చికిత్స చేయించకున్నాడు. ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లో ఉన్న యాషెస్ సిరీస్ సమయానికి మరింత ఫిట్ తయారయ్యేందుకు జానీ బెయిర్ స్టో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బెయిర్‌స్టో ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 39 మ్యాచ్‌లు ఆడి 1,291 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది హాప్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. పంజాబ్ కింగ్స్ తరుపున అతను 253 పరుగులు చేశాడు.
2019 నుంచి ఐపీఎల్‌లో జానీ బెయిర్‌స్టో ఆడుతున్నాడు.