LOADING...
IPL Bowlers: 35 ఏళ్ల తర్వాత కూడా భువీ దుమ్మురేపాడు.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
35 ఏళ్ల తర్వాత కూడా భువీ దుమ్మురేపాడు.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు

IPL Bowlers: 35 ఏళ్ల తర్వాత కూడా భువీ దుమ్మురేపాడు.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు

వ్రాసిన వారు Moogati Shabari
May 17, 2026
11:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఆరో ఓటమి మిగుల్చిన ఆర్‌సీబీ జట్టు కీలక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ తన అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ రెండు కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. ఈ స్పెల్‌తో అతడు పలు రికార్డులను కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.

వివరాలు

35 ఏళ్లు దాటిన తాహిర్ మొత్తం 26 వికెట్లు..

ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో 35 ఏళ్లు దాటిన తర్వాత తాహిర్ మొత్తం 26 వికెట్లు తీశాడు. ఆ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్‌గా నిలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 17 మ్యాచ్‌ల్లో 16.57 సగటుతో వికెట్లు తీసిన తాహిర్ పర్పుల్ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అతని ఎకానమీ రేట్ 6.69గా నమోదైంది.

వివరాలు

పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానం..

ఇక భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 35 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా కూడా అతడు రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆశిష్ నెహ్రా 2015లో తీసిన 22 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 2025లో సాధించిన 22 వికెట్ల రికార్డులను అధిగమించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 16.37 సగటుతో 24 వికెట్లు తీసి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement