
IPL-Cricket-MS Dhoni: ఈలలు..కేకలు..అభిమానుల కేరింతలే.. స్టేడియమంతా ధోని నామస్మరణమే
ఈ వార్తాకథనం ఏంటి
కెప్టెన్ కూల్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనీ(MS Dhoni)ఇప్పుడు ఐపీఎల్(IPL)లో వీర విహారం చేస్తున్నాడు.
చూస్తుంటే ఐపీఎల్ కాదు ధోనీ ప్రీమియర్ లీగ్ పేరు మార్చాలేమో టోర్నీకి.
అంతలా రెచ్చిపోయి ఆడుతున్నాడు ఎంఎస్ ధోనీ.
లఖ్ నవూ క్రికెట్ జట్టుతో ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ధోనీ చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు దిగి 9 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు.
అందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లు కొట్టాడు.
శుక్రవారం రాత్రి చెన్నై జట్టు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ స్టేడియమంతా ధోనీ నామస్మరణతో మార్మోగింది.
బ్యాటింగ్ ఆడేందుకు క్రీజులోకి వెళ్తున్న ధోనీని చూసి అభిమానులంతా ఒక్కసారిగా ఈలలు, కేకలు, కేరింతలతో ధోనీ.. ధోనీ.. ధోనీ.. అంటూ రచ్చ చేసేశారు.
IPL-Dhoni
95 డెసిబుల్స్ కు చేరిన శబ్దాల స్థాయి
ఇలా మైదానమంతా ధోనీ పేరుతో అభిమానులు హోరెత్తించడాన్ని చూసి సౌత్ ఆఫ్రికా బ్యాటర్ అయిన క్వింటన్ డికాక్ భార్య సాషా ఆశ్చర్యపోయింది.
భారతీయులు ఒక వ్యక్తిని, క్రికెట్ ను ఇంతగా అభిమానిస్తారా అని.
అదే సమయంలో ఆమె స్మార్ట్ వాచ్ లో రికార్డైన దృశ్యాన్ని సోషల్ మీడియా వేదిక గా పంచుకుంది.
అభిమానుల హోరుతో శబ్దాల స్థాయి 95 డెసిబుల్స్ కు చేరుకుంది.
ఇదే హోరు మరో పదినిమిషాల పాటు కొనసాగితే మనమంతా వినికిడి శక్తిని కోల్పోయేవాళ్లం...వామ్మో అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఆ వీడియోకు.