Page Loader
IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముగిసింది.. అమ్ముడుపోయిన స్టార్ ఆటగాళ్ల జాబితా ఇదే!
ఐపీఎల్ మెగా వేలం ముగిసింది.. అమ్ముడుపోయిన స్టార్ ఆటగాళ్ల జాబితా ఇదే!

IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముగిసింది.. అమ్ముడుపోయిన స్టార్ ఆటగాళ్ల జాబితా ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఐపీఎల్‌ 2025 మెగా వేలం రెండు రోజుల పాటు విజయవంతంగా జరిగింది. ఈ భారీ ఈవెంట్‌లో మొత్తం 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, 182 మంది ఆటగాళ్లు వేలంలో అమ్ముడయ్యారు. మరో 395 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంచుకోలేదు. 8 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రైట్‌ టు మ్యాచ్‌ కార్డుతో తనవారిని ఎంచుకున్నాయి. ఈ వేలంలో ఫ్రాంచైజీలు మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు రిషబ్‌ పంత్‌ను అత్యధికంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేశారు. ఐపీఎల్‌ 2025 సీజన్ మార్చి 14 నుంచి ప్రారంభమవనుంది. ఈ సీజన్‌లో ఫ్రాంచైజీలు తీసుకున్న కొత్త ఆటగాళ్లతో జట్లు మరింత బలంగా కనిపిస్తున్నాయి.

Details

చైన్నై సూపర్ కింగ్స్ జట్టు

నూర్‌ అహ్మద్‌ (10 కోట్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (9.75కోట్లు), డెవాన్‌ కాన్వే (6.25 కోట్లు) ఖలీల్‌ అహ్మద్‌ (4.8 కోట్లు) రచిన్‌ రవీంద్ర (4 కోట్లు, RTM) అన్షుల్‌ కంబోజ్‌ (3.4 కోట్లు) రాహుల్‌ త్రిపాఠి (3.4 కోట్లు) సామ్‌ కర్రన్‌ (2.4 కోట్లు) గుర్జప్నీత్‌ సింగ్‌ (2.2 కోట్లు) నాథన్‌ ఇల్లిస్‌ (2 కోట్లు) దీపక్‌ హుడా (1.7 కోట్లు) జేమీ ఓవర్టన్‌ (1.5 కోట్లు) విజయ్‌ శంకర్‌ (1.2 కోట్లు) వన్ష్‌ బేడీ (55 లక్షలు) ఆండ్రే సిద్దార్థ్‌ (30 లక్షలు) శ్రేయస్‌ గోపాల్‌ (30 లక్షలు) రామకృష్ణ ఘోష్‌ (30 లక్షలు) కమలేశ్‌ నాగర్‌కోటి (30 లక్షలు) ముకేశ్‌ చౌదరీ (30 లక్షలు) షేక్‌ రషీద్‌ (30 లక్షలు)

Details

ఢిల్లీ క్యాపిటల్స్‌ 

కేఎల్‌ రాహుల్‌ (14 కోట్లు) మిచెల్‌ స్టార్క్‌ (11.75 కోట్లు) టి నటరాజన్‌ (10.75 కోట్లు) జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (9 కోట్లు, RTM) ముకేశ్‌ కుమార్‌ (8 కోట్లు, RTM) హ్యారీ బ్రూక్‌(6.25 కోట్లు) అషుతోశ్‌ శర్మ (3.8 కోట్లు) మోహిత్‌ శర్మ (2.2 కోట్లు) ఫాఫ్‌ డుప్లెసిస్‌ (2 కోట్లు) సమీర్‌ రిజ్వి (95 లక్షలు) డొనొవన్‌ ఫెరియెరా (75 లక్షలు) దుష్మంత చమీరా (75 లక్షలు) విప్రాజ్‌ నిగమ్‌ (50 లక్షలు) కరుణ్‌ నాయర్‌ (50 లక్షలు) మాథవ్‌ తివారి (50 లక్షలు) త్రిపురణ విజయ్‌ (30 లక్షలు) మాన్వంత్‌ కుమార్‌ (30 లక్షలు) అజయ్‌ మండల్‌ (30 లక్షలు) దర్శన్‌ నల్కండే (30 లక్షలు)

Details

గుజరాత్ టైటాన్స్‌

జోస్‌ బట్లర్‌ (15.75 కోట్లు) సిరాజ్‌ (12.25 కోట్లు) రబాడ (10.75 కోట్లు) ప్రసిద్ద్‌ కృష్ణ (9.5 కోట్లు) వాషింగ్టన్‌ సుందర్‌ (3.2 కోట్లు) షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (2.6 కోట్లు) గెరాల్డ్‌ కొయెట్జీ (2.4 కోట్లు) గ్లెన్‌ ఫిలిప్స్‌ (2 కోట్లు) సాయి కిషోర్‌ (2 కోట్లు, RTM) మహిపాల్‌ లోమ్రార్‌ (1.7 కోట్లు) గుర్నూర్‌ సింగ్‌ బ్రార్‌ (1.3 కోట్లు) అర్షద్‌ ఖాన్‌ (1.3 కోట్లు) కరీమ్‌ జనత్‌ (75 లక్షలు) జయంత్‌ యాదవ్‌ (75 లక్షలు) ఇషాంత్‌ శర్మ (75 లక్షలు) కుమార్‌ కుషాగ్రా (65 లక్షలు) మానవ్‌ సుతార్‌ (30 లక్షలు) కుల్వంత్‌ కేజ్రోలియా (30 లక్షలు) అనూజ్‌ రావత్‌ (30 లక్షలు) నిషాంత్‌ సింధు (30 లక్షలు)

Details

కోల్‌కతా నైట్ రైడర్స్

వెంకటేశ్‌ అయ్యర్‌ (23.75 కోట్లు) అన్రిచ్‌ నోర్జే (6.50 కోట్లు) క్వింటన్‌ డికాక్‌ (3.60 కోట్లు) అంగ్‌క్రిష్‌ రఘువంశీ (3 కోట్లు) స్పెన్సర్‌ జాన్సన్‌ (2.8 కోట్లు) మొయిన్‌ అలీ (2 కోట్లు) రహ్మానుల్లా గుర్బాజ్‌ (2 కోట్లు) వైభవ్‌ అరోరా (1.80 కోట్లు) అజింక్య రహానే (1.5 కోట్లు) రోవ్‌మన్‌ పావెల్‌ (1.5 కోట్లు) ఉమ్రాన్‌ మాలిక్‌(75 లక్షలు) మనీశ్‌ పాండే (75 లక్షలు) అనుకూల్‌ రాయ్‌ (40 లక్షలు) లవ్నిత్‌ సిసోడియా (30 లక్షలు) మయాంక్‌ మార్కండే (30 లక్షలు)

Details

లక్నో సూపర్‌ జెయింట్స్‌

రిషబ్‌ పంత్‌ (27 కోట్లు) ఆవేశ్‌ ఖాన్‌ (9.75 కోట్లు) ఆకాశ్‌దీప్‌ (8 కోట్లు) డేవిడ్‌ మిల్లర్‌ (7.5 కోట్లు) అబ్దుల్‌ సమద్‌ (4.2 కోట్లు) మిచెల్‌ మార్ష్‌ (3.4 కోట్లు) షాబాజ్‌ అహ్మద్‌ (2.4 కోట్లు) ఎయిడెన్‌ మార్క్రమ్‌ (2 కోట్లు) మాథ్యూ బ్రీట్జ్కీ (75 లక్షలు) షమార్‌ జోసఫ్‌ (75 లక్షలు, RTM) ఎం సిద్దార్థ్‌ (75 లక్షలు) అర్శిన్‌ కులకర్ణి (30 లక్షలు) రాజవర్దన్‌ హంగార్గేకర్‌ (30 లక్షలు) యువరాజ్‌ చౌదరీ (30 లక్షలు) ప్రిన్స్‌ యాదవ్‌ (30 లక్షలు) ఆకాశ్‌ సింగ్‌ (30 లక్షలు) దిగ్వేశ్‌ సింగ్‌ (30 లక్షలు) హిమ్మత్‌ సింగ్‌ (30 లక్షలు) ఆర్యన్‌ జుయల్‌ (30 లక్షలు)

Details

ముంబై ఇండియన్స్‌

ట్రెంట్‌ బౌల్ట్‌ (12.50 కోట్లు) దీపక్‌ చాహర్‌ (9.25 కోట్లు) విల్‌ జాక్స్‌ (5.25 కోట్లు) నమన్‌ ధిర్‌ (5.25 కోట్లు, RTM) అల్లా ఘజన్‌ఫర్‌ (4.8 కోట్లు) మిచెల్‌ సాంట్నర్‌ (2 కోట్లు) ర్యాన్‌ రికెల్టన్‌ (1 కోటీ) లిజాడ్‌ విలియమ్స్‌ (75 లక్షలు) రీస్‌ టాప్లే (75 లక్షలు) రాబిన్‌ మింజ్‌ (65 లక్షలు) కర్ణ్‌ శర్మ (50 లక్షలు) విజ్ఞేశ్‌ పుథుర్‌ (30 లక్షలు) అర్జున్‌ టెండూల్కర్‌ (30 లక్షలు) బెవాన్‌ జాన్‌ జాకబ్స్‌ (30 లక్షలు) వెంకట సత్యనారాయణ పెన్మత్స (30 లక్షలు) రాజ్‌ అంగద్‌ బవా (30 లక్షలు) శ్రీజిత్‌ కృష్ణణ్‌ (30 లక్షలు) అశ్వనీ కుమార్‌ (30 లక్షలు)

Details

పంజాబ్‌ కింగ్స్‌

అయ్యర్‌(26.75 కోట్లు) చహల్‌(18 కోట్లు) అర్షదీప్‌ సింగ్‌ (18 కోట్లు, RTM) స్టోయినిస్‌ (11 కోట్లు) మార్కో జన్సెన్‌ (7 కోట్లు) వధేరా (4.2 కోట్లు) మ్యాక్స్‌వెల్‌ (4.2 కోట్లు) ప్రియాన్శ్‌ ఆర్య (3.8 కోట్లు) ఇంగ్లిస్‌ (2.6 కోట్లు) ఒమర్‌జాయ్‌ (2.4 కోట్లు) ఫెర్గూసన్‌ (2 కోట్లు) విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (1.8 కోట్లు) యశ్‌ ఠాకర్‌ (1.60కోట్లు) హర్ప్రీత్‌ బ్రార్‌ (1.5కోట్లు) ఆరోన్‌ హార్డీ (1.25 కోట్లు) విష్ణు వినోద్‌ (95 లక్షలు) జేవియర్‌ బార్ట్‌లెట్‌ (80 లక్షలు) కుల్దీప్‌ సేన్‌ (80 లక్షలు) ప్రవిణ్‌ దూబే (30 లక్షలు) పైలా అవినాశ్‌ (30లక్షలు) సూర్యాంశ్‌ షెడ్గే (30 లక్షలు) ముషీర్‌ ఖాన్‌ (30 లక్షలు) హర్నూర్‌ పన్నూ (30 లక్షలు)

Details

రాజస్థాన్‌ రాయల్స్‌

జోఫ్రా ఆర్చర్‌ (12.50 కోట్లు) తుషార్‌ దేశ్‌పాండే (6.5 కోట్లు) వనిందు హసరంగ (5.25 ‍కోట్లు) మహీశ్‌ తీక్షణ (4.40 కోట్లు) నితీశ్‌ రాణా (4.2 కోట్లు) ఫజల్‌ హక్‌ ఫారూకీ (2 కోట్లు) క్వేనా మపాకా (1.5 కోట్లు) ఆకాశ్‌ మధ్వాల్‌ (1.20 కోట్లు) వైభవ్‌ సూర్యవంశీ (1.1 కోట్లు) శుభమ్‌ దూబే (80 లక్షలు) యుద్ద్‌వీర్‌ చరక్‌ (35 లక్షలు) ఆశోక్‌ శర్మ (30 లక్షలు) కునాల్‌ రాథోడ్‌ (30 లక్షలు) కుమార్‌ కార్తీకేయ (30 లక్షలు)

Details

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జోష్‌ హాజిల్‌వుడ్‌ (12.50 కోట్లు) ఫిల్‌ సాల్ట్‌ (11.50 కోట్లు) జితేశ్‌ శర్మ (11 కోట్లు) భువనేశ్వర్‌ కుమార్‌ (10.75 కోట్లు) లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (8.75 కోట్లు) రసిఖ్‌ దార్‌ (6 కోట్లు) కృనాల్‌ పాండ్యా (5.75 కోట్లు) టిమ్‌ డేవిడ్‌ (3 కోట్లు) జేకబ్‌ బేతెల్‌ (2.6 కోట్లు) సుయాశ్‌ శర్మ (2.6 కోట్లు) దేవ్‌దత్‌ పడిక్కల్‌ (2 కోట్లు) నువాన్‌ తుషార (1.6 కోట్లు) రొమారియో షెపర్డ్‌ (1.5 కోట్లు) లుంగి ఎంగిడి (1 కోటీ) స్వప్నిల్‌ సింగ్‌ (50 లక్షలు, RTM) మోహిత్‌ రతీ (30 లక్షలు) అభినందన్‌ సింగ్‌ (30 లక్షలు) స్వస్తిక్‌ చికార (30 లక్షలు) మనోజ్‌ భాంగడే (30 లక్షలు)

Details

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ఇషాన్‌ కిషన్‌ (11.25 కోట్లు) మొహమ్మద్‌ షమీ (10 కోట్లు) హర్షల్‌ పటేల్‌ (8 కోట్లు) అభినవ్‌ మనోహర్‌ (3.20కోట్లు) రాహుల్‌ చాహల్‌ (3.20 కోట్లు) ఆడమ్‌ జంపా (2.40 కోట్లు) సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (1.50 కోట్లు) ఎస్‌హాన్‌ మలింగ (1.2 కోట్లు) బ్రైడన్‌ కార్స్‌ (1 కోటీ) జయదేవ్‌ ఉనద్కత్‌ (1 కోటీ) కమిందు మెండిస్‌ (75 లక్షలు) జీషన్‌ అన్సారీ (40 లక్షలు) సచిన్‌ బేబి (30 లక్షలు) అనికేత్‌ వర్మ (30 లక్షలు) అథర్వ తైడే (30 లక్షలు)