LOADING...
IPL 2026: ఆలస్యంగా రాజస్థాన్-ముంబై మ్యాచ్… 11 ఓవర్లకు కుదింపు
ఆలస్యంగా రాజస్థాన్-ముంబై మ్యాచ్… 11 ఓవర్లకు కుదింపు

IPL 2026: ఆలస్యంగా రాజస్థాన్-ముంబై మ్యాచ్… 11 ఓవర్లకు కుదింపు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
10:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పరిస్థితుల నేపథ్యంలో అంపైర్లు మ్యాచ్‌ను 11 ఓవర్ల పరిమితికి కుదించారు. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

వివరాలు

కెప్టెన్లు ఏమన్నారంటే..

టాస్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. "మేము బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇలాంటి వర్ష ప్రభావిత మ్యాచ్‌లలో ఛేజ్ చేయడం సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది సీజన్ ప్రారంభం మాత్రమే, కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. వాటినుండి నేర్చుకొని ముందుకు వెళ్తాం." అని తెలిపారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. "మేము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటాం. వర్షం వల్ల పిచ్ తేమగా ఉంది. అయినప్పటికీ 11 ఓవర్ల మ్యాచ్ కావడం వల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. మా జట్టు ప్రదర్శనపై సంతోషంగా ఉన్నాం. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాం" అని వివరించాడు.

వివరాలు

జట్ల వివరాలివే..

రాజస్థాన్ రాయల్స్ జట్టు: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఏఎం ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

Advertisement