
IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 తిరిగి నేడు పునః ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. సొంత మైదానంలో ఆర్సీబీ గెలిస్తే ఆ జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరతుంది. కోల్‌కతా మాత్రం ప్లేఆఫ్స్ అవకాశాలను నిలిపేందుకు ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాలి. ఇరు జట్లకు గెలవాల్సిన అవసరం ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుందని అంచనా.
Details
విధులు
భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ బ్రేక్ వలన చాలామంది విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు వెళ్లిపోగా, జాతీయ విధుల కారణంగా అందరూ తిరిగి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీకు అదృష్టం అనుకోవాలి. ఎక్కువ విదేశీ ప్లేయర్లు జట్టులో చేరగా, స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ రావడం ఖాయమైతే, అతను ఆర్సీబీతో పాటు ఉంటాడో లేదో స్పష్టత లేదు. ఆల్‌రౌండర్ జాకబ్ బెతెల్ జట్టులో లేడు. అయితే ఫీల్ సాల్ట్, లుంగి ఎంగిడి, టీమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టన్, షెఫర్డ్ ఆర్సీబీ జట్టులో చేరారు. గాయాలతో బాధపడుతున్న కెప్టెన్ రజత్ పాటీదార్ కోలుకోవడం ఆర్సీబీకి శుభ సంకేతం.
Details
కోహ్లీ పైనే అందరి దృష్టి
ఇక టెస్టు క్రికెట్ నుంచి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీపై అందరి దృష్టి నిలుస్తోంది. కోల్‌కతా జట్టు ఈ మ్యాచ్ ఓడితే ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతవుతాయి. జట్టు నుండి మొయిన్ అలీ సేవలను కోల్పోయినప్పటికీ, నరైన్, రసెల్, గుర్బాజ్ వంటి ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. కెప్టెన్ రహానే మంచి ప్రదర్శనతో ఉండటం ఆ జట్టుకు కలిసోచ్చే అంశం. కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ తన ప్రతిభ చూపించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది.