LOADING...
Shubman Gill: ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్

Shubman Gill: ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 27, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో అమలు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రూల్ వల్ల ఆటలో ఉన్న నైపుణ్యం తగ్గిపోతుందని, క్రికెట్ ఒకే విధంగా మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిబంధనను 2023 ఐపీఎల్ సీజన్‌లో ప్రవేశపెట్టారు. అంతకు ముందు 2022 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. కొంతమంది ఈ రూల్ వల్ల జట్లకు అదనపు బ్యాట్స్‌మన్ అవకాశం లభిస్తుందని సమర్థిస్తుండగా, గిల్ వంటి ఆటగాళ్లు మాత్రం ఇది ఆట తీరునే మార్చేస్తోందని అంటున్నారు.

వివరాలు 

అలా చేయడం వల్ల ఇబ్బందులు..

ఈ విషయంపై మాట్లాడిన గిల్, సంప్రదాయంగా క్రికెట్ 11 మంది ఆటగాళ్లతో ఆడే ఆట అని గుర్తుచేశారు. అదనంగా ఒక బ్యాట్స్‌మన్ రావడం వల్ల ఆటలో ఉన్న సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. ఇంపాక్ట్ ప్లేయర్ అవసరం లేదని, ఒక అదనపు ఆటగాడితో ఆట ఒకే దిశగా మారుతోందని ఆయన అన్నారు. కష్టమైన పిచ్‌లపై తక్కువ లక్ష్యాలను ఛేజ్ చేయడం తనకు ఇష్టమని, ఫ్లాట్ పిచ్‌లపై భారీ స్కోర్లు చేయడం కంటే అది మెరుగని గిల్ అభిప్రాయపడ్డారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల స్కోర్లు పెరిగినా, తన ప్రధాన లక్ష్యం మ్యాచ్‌లు గెలవడమేనని గిల్ స్పష్టం చేశారు.

వివరాలు 

మ్యాచ్ గెలుపే లక్ష్యం: గిల్

చివరికి ప్రత్యర్థి జట్టుకంటే ఎక్కువ పరుగులు చేయడమే ముఖ్యమని, ఒక్క మ్యాచ్‌లో 300-350 పరుగులు చేయడమే లక్ష్యం కాదన్నారు. ప్రతి మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా మంచి స్కోరు చేయడం ముఖ్యమని చెప్పారు. గత సీజన్‌లో తన జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన గిల్, ఐపీఎల్‌లో అత్యంత స్థిరంగా ఆడుతున్న బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా నిలిచారు. 2020 నుంచి ప్రతి సీజన్‌లో వరుసగా 440, 478, 483, 890, 426, 650 పరుగులు చేశారు. మార్చి 31న పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌కు ముందు మాట్లాడిన గిల్, ఈ సీజన్‌లో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

Advertisement