Page Loader
IPL2023 Opening Ceremony: ఐపిఎల్ ఆరంభ వేడుకలలో తెలుగు పాటల హవా
అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ 2023

IPL2023 Opening Ceremony: ఐపిఎల్ ఆరంభ వేడుకలలో తెలుగు పాటల హవా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2023
08:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ లో టి20 క్రికెట్‌ కి ఉన్న క్రేజ్ వేరు​. అందులోను ఐపీఎల్‌ అనగానే క్రికెట్ ప్రియులకు పూనకాలు ప్రారంభం అవుతాయి. 15 సీజన్ల నుంచి హోరాహోరీగా జరుగుతున్న మ్యాచ్‌లు.. ఎవరికి ఊహకందని మలుపులతో చివరి నిమిషం వరకూ దోబూచులాడే ఫలితాలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరోజు సరిపోదు. ప్రతి సారీ అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచే ఈ మెగాటోర్నీఈ రోజు సాయంత్రం చాలా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ రోజు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ గ్రౌండ్ లో ప్రారంభమైన 2023 సీజన్ ఐపిఎల్ లో తెలుగు ఆల్‌టైమ్ హిట్ మూవీస్ పుష్ప, ట్రిపుల్ ఆర్ సాంగ్స్‌తో స్టేడియం దద్దరిలింది.

ఐపిఎల్ 2023

రచ్చ చేసిన టాలీవుడ్ డ్రీమ్ గర్ల్స్

ఈ వేడుకల ప్రారంభంలో గాయకుడు అర్జిత్ సింగ్ తన గానంతో ముందుగా ప్రేక్షకులను మైమరపించాడు. అటు తరువాత టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఇండియన్ క్రష్‌ రష్మిక మందన్న పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమా పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అటు తర్వాత ఈ ఇద్దరూ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు' పాటతో వేడుకలను మరో స్థాయికి తీసుకెళ్లారు. పుష్ప చిత్రంలోని సాంగ్‌కు తమన్నా వేసిన స్టెప్ లు చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. తనదైన హుక్ స్టెప్‌తో నడుము ఊపుతూ కుర్రకారును కవ్వించింది రష్మిక. రష్మిక ప్రదర్శనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

మందిరా బేడీ

చాలాకాలం తరువాత యాంకర్ గా మందిరా బేడీ

ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో తెలుగు సాంగ్స్ భాగమవ్వడం పట్ల తెలుగు అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. మందిరా బేడీ ఐపీఎల్ యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్ లో గుజరాత్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ధోని సేన తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

IPL 2023 ప్రారంభ వేడుకలో రష్మిక మందన్న