LOADING...
ICC Mens T20 World Cup: ఐర్లాండ్‌ - జింబాబ్వే మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్
ఐర్లాండ్‌ - జింబాబ్వే మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్

ICC Mens T20 World Cup: ఐర్లాండ్‌ - జింబాబ్వే మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండు పరాజయాలతో సూపర్‌ 8కి చేరే అవకాశం వేరే జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్న ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భాగంగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 3.00 గంటలకు ఐర్లాండ్‌, జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అంపైర్లు ప్రకారం, ఒక్క బంతి కూడా పడకపోవడంతో ఈ మ్యాచ్ పూర్తి రద్దు అని ప్రకటించారు. ఫలితంగా, ఐర్లాండ్‌, జింబాబ్వే జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ఈ పరిణామంతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌ బీలో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, ఒమన్ జట్లు పోటీ పడుతున్నాయి.

Details

సూపర్ 8కి అర్హత సాధించిన జింబాబ్వే

మూడు మ్యాచ్‌లలో మూడింటిలోనే ఓడిన ఒమన్ ఇప్పటికే టోర్నీ నుంచి అవుట్ అయింది. శ్రీలంక సూపర్‌ 8కి క్వాలిఫై అయింది, ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. తాజాగా ఐర్లాండ్‌తో వర్షం కారణంగా రద్దైన మ్యాచ్ వల్ల జింబాబ్వేకు 1 పాయింట్ లభించడంతో ఆ జట్టు 5 పాయింట్లతో సూపర్‌ 8లోకి చేరింది. ఈ పరిణామంతో గ్రూప్‌ బీ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్ టోర్నీ నుంచి బయటపడ్డాయి.

Details

ఇప్పుడు గ్రూప్‌ల పరిస్థితి ఇలా ఉంది

ఫిబ్రవరి 20 శుక్రవారం ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించినా, ఆస్ట్రేలియా ఖాతాలో కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ మ్యాచ్ ఆసీస్ కోసం నామమాత్రమే అవుతుంది. గ్రూప్‌ ఏ నుంచి భారత్ సూపర్‌ 8లోకి చేరింది. గ్రూప్‌ సీ నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లాండ్. గ్రూప్‌ డీ నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్‌ 8కి అర్హత పొందాయి. గ్రూప్‌ బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే సూపర్‌ 8లోకి చేరాయి. ఇంకా గ్రూప్‌ ఏలో ఒక స్లాట్ ఖాళీ ఉంది, ఆ స్థానానికి పాకిస్తాన్‌, యూఎస్‌ఏ పోటీ పడుతున్నారు.

Advertisement