LOADING...
Ahmedabad Stadium: భారత్‌కు అహ్మదాబాద్ స్టేడియం అపశకునమా? అభిమానుల్లో పెరుగుతున్న సందేహాలు ఇవే!
భారత్‌కు అహ్మదాబాద్ స్టేడియం అపశకునమా? అభిమానుల్లో పెరుగుతున్న సందేహాలు ఇవే!

Ahmedabad Stadium: భారత్‌కు అహ్మదాబాద్ స్టేడియం అపశకునమా? అభిమానుల్లో పెరుగుతున్న సందేహాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొంతకాలంగా అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంపై టీమిండియా క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ముంబై, చెన్నై స్టేడియాల మాదిరిగా గొప్ప క్రీడా వారసత్వం ఈ మైదానానికి లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదనంగా ఇక్కడి పిచ్ పరిస్థితులు కూడా స్థిరంగా లేకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ విమర్శల మధ్య భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం అహ్మదాబాద్ స్టేడియానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టే కనిపిస్తోంది. భారత్ పాల్గొనే ప్రధాన మ్యాచ్‌లు తరచుగా ఇక్కడే నిర్వహించబడుతున్నాయి. తాజాగా జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాను ఎదుర్కొన్న పోటీ కూడా ఇదే వేదికపై జరిగింది.

Details

అభిమానులు తీవ్ర అసంతృప్తి 

ఇదే అహ్మదాబాద్ మైదానంలో భారత్ గతంలో ఐసీసీ టోర్నీలో ఆడినప్పుడు చేదు అనుభవం ఎదురైంది. 2023లో జరిగిన 50 ఓవర్ల వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి పాలైంది. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లోనూ ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ పరాజయం చెందడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ స్టేడియం భారత్‌కు 'అనర్థకర వేదిక'గా మారిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు అయితే ఈ స్టేడియాన్ని కూల్చేయాలని కూడా ఆగ్రహావేశంతో వ్యాఖ్యలు చేస్తున్నారు.

Details

మైదానం గురించి ప్రతికూల చర్చలు

అయితే మరో వర్గం అభిమానులు మాత్రం స్టేడియంతో జట్టు ప్రదర్శనకు సంబంధం లేదని, ఆటగాళ్లకు కూడా కొన్ని రోజులు అనుకూలంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఇటీవల ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్‌కు ఎదురైన రెండు పరాజయాలు కూడా అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలోనే రావడం అభిమానుల్లో నెగటివ్ భావనను మరింత బలపరుస్తోంది. దీంతో ఈ మైదానం గురించి ప్రతికూల చర్చలు మరింత పెరుగుతున్నాయి.

Advertisement